తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన లారీ ముగ్గురిని బలి తీసుకుంది. ఈ ఘటన మేడ్చల్ చెక్‌పోస్టు వద్ద ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య, కుతురు, కొడుకుతో బైక్‌పై వెళ్తున్నాడు. అదే క్రమంలో ఒక లారీ అతి వేగంగా వచ్చి అదుపు తప్పి వారి బైక్‌ను ఢీకొట్టింది.
ఇది కూడా చదవండి: సినిమా ఇండస్ట్రీకి పవన్ కీలక సూచన.. సంచలన లేఖ విడుదల!
ముగ్గురు మృతి
ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. కొడుకు కాళ్లపై నుంచి లారీ వెళ్లడంతో అతడి రెండు కాళ్లు విరిగిపోయాయి. ఈ ఘటన తర్వాత లారీ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అలాంటి ఘటనే మరొకటి
ఇలాంటిదే మరో రోడ్డు ప్రమాదం ఇవాళ వరంగల్‌లో జరిగింది. విధులకై పోలీస్ కమిషనరేట్‌కి బైక్‌పై వెళ్తున్న కానిస్టేబుల్ శ్రీరామ్‌రాజు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మట్టెవాడలో రోడ్డుపై వెళ్తున్న శ్రీరామ్‌రాజును గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ శ్రీరామ్‌రాజు తీవ్ర గాయాలతో కింద పడిపోయాడు.
Also Read : బండి సంజయ్ నా బ్రదర్.. RTV ఇంటర్వ్యూలో పొన్నం సంచలన సీక్రెట్స్
స్థానికులు వెంటనే గమనించి ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ శ్రీరామ్‌రాజు పరిస్థితి విషమించడంతో.. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించే సమయంలో మార్గమధ్యలోనే అతడు మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల్లో మార్పులు