BCCI: రోహిత్‌కు బీసీసీఐ బిగ్ షాక్.. హింట్ ఇచ్చేసిన సెలెక్టర్లు!

భారత కెప్టెన్ రోహిత్ శర్మకు బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. స్వతహాగా రిటైర్మెంట్ ప్రకటించాలని, లేదంటే జట్టునుంచి తొలగిస్తామని సెలెక్టర్లు హింట్ ఇచ్చినట్లు సమాచారం. చాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత రోహిత్ గుడ్‌బై చెప్పడం ఖాయమేనట. 

New Update
bcci rohit sharma

bcci rohit sharma Photograph: (bcci rohit sharma)

BCCI: 6, 5, 8, 2, 0, 8, 3, 6, 10, 3 ఇవి స్కూల్ పిల్లొడి మార్కులు కాదు. హిట్‌మ్యాన్‌గా పేరు తెచ్చుకున్న ఇండియా క్రికెట్ ‌టీం కెప్టెన్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో చేసిన స్కోరు. ఎంత మంచి మెడిసిన్‌కు అయిన ఓ టైం అంటూ ఉంటుందని తెలుసు. ఎక్స్‌పెయిరీ టైం అవుపోతే.. దాని వల్ల కలిగే లాభాల కంటే నష్టాలే ఎక్కువ. ప్రసెంట్ ఇలాంటి సిచువేషనే ఫేస్ చేస్తోంది ఇండియా టీం. ఇద్దరు స్టార్ ప్లేయిర్లు, అది కూడా ఎవరో కాదు. టీం కెప్టెన్, విరాట్ చెత్త ఫర్మామెన్స్‌తో జట్టు అంతా  నిరాశకు చెందుతుంది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ ఘోరంగా విఫలమయ్యాడు. ఐదు ఇన్నింగ్స్‌లలో నాలుగు సింగిల్ డిజిట్ స్కోర్‌లను నమోదు చేశాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో 6.2 యావరేజ్ స్కోర్‌తో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతన్ని జట్టు నుంచి తప్పించాలని డిమాండ్లు వస్తున్నాయి. రోహిత్ శర్మను ఇండియా క్రికెట్ అభిమానులు సోషల్  మీడియాలో ఘోరంగా ట్రోల్స్ చేశారు. దీంతో రోహిత్ శర్మను జనవరి 3న జరుగుతున్న చివరి టెస్ట్‌లో బెంచ్‌పైనే కూర్చొబెట్టారు. టి 20, వన్ డే మ్యాచ్‌లో ప్రపంచ రికార్డులు క్రియేట్ చేసిన రోహిత్.. బ్యాక్ టూ బ్యాక్ వరస్ట్ ఫర్మామెన్స్ ఇస్తున్నాడు. దీంతో ఎక్స్‌లో హ్యాపీ రిటైర్మెంట్ అని హ్యాష్‌ట్యాగ్ ట్రెంట్ అవుతోంది. రోహిత్ శర్మ స్వతహాగా రిటైర్మెంట్ ప్రకటిస్తాడా? బీసీసీఐ బోర్డే తీస్తేతోందా? అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి. అసలు ఏం జరుగుతోందో తెలుసుకుందాం.

బీసీసీఐ పెద్దలు, సెలెక్టర్లు కీలక నిర్ణయం..

రోహిత్ శర్మ.. మూడు ఫార్మాట్లలోనూ టీమిండియా టాప్‌కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్. టీ 20లో 35 బాల్స్‌లోనే సెంచరీ చేసిన ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్. అంతేకాదు వన్ డేలో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఘనత కూడా హిట్‌మ్యాన్‌ లెక్కల్లో ఉంది. కానీ.. టెస్ట్ సిరీస్‌లో రోహిత్ శర్మ ఆట అంతంత మాత్రమే. క్రమంగా ఆయన ఫామ్ కోల్పోతూ.. కెరీర్ చరమాంకానికి చేరుకుంది. టీ20 వరల్డ్ కప్-2024 తర్వాత షార్ట్ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అతడు.. వన్డేలు, టెస్టుల్లో ఇంకా కంటిన్యూ అవుతున్నాడు. చాంపియన్స్ ట్రోఫీ-2025 తర్వాత 50 ఓవర్ల ఫార్మాట్‌కూ రోహిత్ గుడ్‌బై చెప్పడం ఖాయమని అనుకుంటున్నారు. అయితే వన్డేల కంటే ముందు టెస్టుల నుంచి రోహిత్ తప్పుకునేట్లుగా కనిప్తోంది. గంభీర్ కోచ్‌గా వచ్చినప్పటి నుంచి రోహిత్ సరిగ్గా ఆడట్లేదు. అటు వన్డేలు, ఇటు టెస్టుల్లో దారుణంగా పెర్ఫార్మ్ చేస్తున్నాడు. ముఖ్యంగా లాంగ్ ఫార్మాట్‌లో అతడి బ్యాట్ సరిగా ఆడటంలేదు. సెంచరీ మాట దేవుడెరుగు.. హాఫ్ సెంచరీ కొట్టడం కూడా గగనం అయిపోతోంది. శ్రీలంక చేతుల్లో వన్డే సిరీస్ ఓటమి, న్యూజిలాండ్ సిరీస్‌లో ‌వాష్‌ఔట్, ప్రసెంట్ ఆస్ట్రేలియా సిరీస్‌లో వరుస పరాజయాలు రోహిత్‌ కెరీర్ గ్రాఫ్‌ను కంప్లీట్‌గా కింద పడేశాయి. దీంతో కోచ్ గంభీర్, బీసీసీఐ పెద్దలు, సెలెక్టర్లు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 

0 సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం.. 

సిడ్నీ వేదికగా జరగుతున్న ఆఖరి టెస్ట్‌ తర్వాత రోహిత్‌ను పక్కనబెట్టాలని ఫిక్స్ అయ్యారట. డ్రెస్సింగ్ రూమ్‌లో కోచ్ గౌతమ్ గంభీర్ క్లాస్ ‌కూడా  తీసుకున్నాడని వార్తలు వస్తున్నాయి. కెప్టెన్సీ పగ్గాలను పేస్ బోలర్ జస్‌ప్రీత్ బుమ్రాకు అప్పగించే పనులు మొదలయ్యాయని సమాచారం. ఈ టెస్ట్‌లో బూమ్రా తన బౌలింగ్‌తో సూపర్ ఫర్మామెన్స్ చేశాడు. బోర్డర్ గ‌వాస్కర్ ట్రోఫీలో నాలుగు టెస్టుల్లో బుమ్రా 30 వికెట్లు సాధిస్తే.. కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఐదు ఇన్నింగ్స్‌లలో కేవలం 31 పరుగులు సాధించాడు.  దీంతో సోషల్ మీడియాలో హిట్‌మ్యాన్ బ్యాటింగ్‌ స్కోర్‌ బూమ్రా తీసిన వికెట్లతో పోటీ పడుతుందని హేళన చేస్తున్నారు. రెండవ బిడ్డ పుట్టిన కారణంగా హిట్‌మ్యాన్ ఫస్ట్ టెస్ట్‌కు దూరమయ్యాడు. సరిగా ఆడటంలేదని ఆఖరి 5వ టెస్ట్‌ నుంచి తీసేశారు. మిగిలి మూడు టెస్టులు 15 ఇన్నింగ్స్‌లలో 10 సింగిల్ డిజిట్ స్కోర్లకే రోహిత్ పరిమితమైయ్యాడు. అందుకే అంత వ్యతిరేకత వచ్చింది. రోహిత్ శర్మ ఫ్యాన్సే అతన్ని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. వరుస ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ స్కోర్ 6, 5, 23, 8, 2, 52, 0, 8, 18, 11, 3, 6, 10, 3 ఇలా ఉండగా.. మొత్తం 155. నాలుగో టెస్ట్‌లో తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి 176 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిక్సర్‌తో సెంచరీ కొట్టాడు.  అంత‌ర్జాతీయ క్రికెట్‌లో నితీష్‌రెడ్డికి ఇదే తొలి సెంచ‌రీ కావ‌డం విశేషం. 5 రికార్డుల‌ను నితీశ్ రెడ్డి త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియాలో ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన తొలి భార‌త ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు.

ఇది కూడా చదవండి: Bhopal: 5లక్షల మందిని మింగిన భోపాల్ గ్యాస్ ఫ్యాక్టరీ.. 40ఏళ్ల తర్వాత ఎందుకు తెరిచారంటే?

అటు జస్మిత్ బూమ్రా ముందు కూడా ఓ రికార్డ్ ఉంది. బూమ్రా ఇప్పటికే 4 టెస్టుల్లో 30 వికెట్లు తీశాడు. ఫైనల్ టెస్ట్‌లో మరో ఆరు వికెట్లు తీస్తే.. టీమ్ఇండియా త‌రుపున అత్యధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా బూమ్రా రికార్డులోకి ఎక్కుతాడు. ప్ర‌స్తుతం ఈ రికార్డు లెగ్ స్పిన్నర్ బీఎస్ చంద్ర శేఖ‌ర్ పేరిట ఉంది. 1972-73లో ఇంగ్లాండ్ జ‌ట్టు భార‌త ప‌ర్యట‌న‌కు వ‌చ్చిన‌ప్పుడు ఐదు టెస్టుల్లో 35 వికెట్లు ప‌డ‌గొట్టాడు. టెస్ట్ సిరిస్ మధ్యలో తప్పించిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ అప్రతిష్ఠను మూటగట్టుకున్నాడు.  1975 తర్వాత ఒక భారత కెప్టెన్‌ను సిరీస్ మధ్యలో జట్టు నుంచి తప్పించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 1975లో, ఆఫ్ స్పిన్నర్ వెంకటరాఘవన్ కూడా మొదటి టెస్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన తర్వాత రెండో టెస్టు నుంచి తొలగించారు. అతను పన్నెండవ ఆటగాడు అయ్యాడు. ఇప్పుడు రోహిత్ శర్మ మిడిల్ సిరీస్‌లో ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తొలగించారు. అయితే, రోహిత్ తన ఇష్టానుసారంగానే సిడ్నీ టెస్టుకు దూరమయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి. రోహిత్ శర్మ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా సిడ్నీ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. పెర్త్‌లో 2024 నవంబర్ 22న జరిగిన తొలి టెస్టులో అతని కెప్టెన్సీలోనే భారత్ విజయం సాధించింది. తర్వాతి మూడు టెస్టులకు రోహిత్ కెప్టెన్‌గా వ్యవహరించగా.. అందులో టీమిండియా 2 టెస్టుల్లో ఓడిపోగా, ఒక మ్యాచ్ డ్రా అయింది. జనవరి 3న ఆఖరి టెస్ట్ ప్రారంభమైంది.

ఇది కూడా చదవండి: Telangana Cabinet: ముగిసిన కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలు ఇవే

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు