TG Local Elections: తెలంగాణ స్థానిక ఎన్నికల షెడ్యూల్.. బిగ్ అప్డేట్!

బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ను కల్పిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో రిజర్వేషన్ల అంశం ఒక కొలిక్కివచ్చినట్లయింది. దీంతో  స్థానిక సంస్థలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది.

New Update
Local Bodie Elections

Local Bodie Elections

TG Local Elections:   బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ను కల్పిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో రిజర్వేషన్ల అంశం ఒక కొలిక్కివచ్చినట్లయింది. దీంతో  స్థానిక సంస్థలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈ మేరకు  రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ రోజు ప్రత్యేక సమావేశం నిర్వహించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణికుముదినీ ఉన్నతాధికారులతో కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎస్‌ రామకృష్ణారావు, అదనపు డీజీ మహేశ్‌ భగవత్‌, పంచాయతీరాజ్‌ సెక్రటరీ శ్రీధర్ , ఆర్ధిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎక్సై్జ్ శాఖ కమిషనర్ హరికిరణ్ తదితరులతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చూడండి: HYD Rains : హైదరాబాద్ లో హై అలర్ట్.. ఉప్పొంగుతున్న మూసీ.. డేంజర్ లో హిమాయత్ సాగర్‌, ఉస్మాన్ సాగర్!

ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, ఎలక్షన్ బందోబస్తు, రిజర్వేషన్లపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ముందుగా ఏ ఎన్నికలు నిర్వహించాలి..? మొత్తం ఎన్ని దశల్లో ఎన్నికలు నిర్వహించాలనే అంశంపై చర్చించినట్లు సమాచారం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందేజ ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి ఎన్నికలకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం వివిధ విభాగాల ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించింది.

ఇది కూడా చూడండి: Hyderabad: ఉప్పొంగిన మూసీ... మునిగిన ఎంజీబీఎస్

కాగా చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. అందులో భాగంగా స్థానిక సంస్థల (రూరల్, అర్బన్)​ఎన్నికల్లో బీసీలకు 42 శాతం కోటా ను కేటాయిస్తూ  శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలసిందే. ఈ మేరకు రిజర్వేషన్లు పెంచుతూ శుక్రవారం బీసీ సంక్షేమ శాఖ  నంబర్​ 9ని విడుదల చేయించింది.  కాగా బీసీ రిజర్వేషన్‌ పై అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాలతో పాటు మిగిలిప పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లుల ఆధారంగా, బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే లక్ష్యంతో ఈ జీవోను వెంటనే అమలులోకి తెస్తున్నట్లు ప్రభుత్కం  ప్రకటించింది.

దిగువ అణగానిప వర్గాలు అందరితో పాటు ఎదగాలనే ఉద్దేశంతో అణగారిన వర్గాలు అందరితోపాటు ఎదగాలన్నదే తమ ఉద్దేశమని, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. బీసీ రిజర్వేషన్లకు లైన్ క్లియర్ కావడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం లోకల్ బాడీ ఎన్నికల నిర్వహించేందుకు  సిద్ధమైంది. ఒకటి రెండు రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: Weather Update: తెలంగాణకు బిగ్ అలర్ట్.. ఈ  రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు.. రెండు రోజులు దంచుడే దంచుడు

Advertisment
తాజా కథనాలు