TG Elections Notification: తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కముదిని వెల్లడించారు.

New Update
BREAKING

BREAKING

Telangana Local Body Elections Notification Released

తెలంగాణలో పంచాయతీ ఎన్నిక(telangana local body elections 2025)లకు షెడ్యూల్ విడుదలైంది. 12,760 గ్రామాలకు, లక్షా 13 వేల 534 వార్టులకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆమోదం తెలిపింది. డిసెంబర్ 11, 14, 17 తేదీ(telangana local body elections dates)ల్లో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కముదిని వెల్లడించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ జరగుతుందని పేర్కొన్నారు. 2 గంటల నుంచి కౌంటింగ్ ఉంటుందని చెప్పారు. ఈరోజు నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినట్లు తెలిపారు. 

ఈ నెల 27 నుంచి మొదటి దశ ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభం కానున్నాయని చెప్పారు. 30వ తేది నుంచి రెండో దశ, డిసెంబర్ 3 నుంచి మూడో దశ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కోటి 66 లక్షల మంది గ్రామీణ ఓటర్లు ఉన్నారని.. ఓటర్ల జాబితా సహా అన్ని వివరాలు తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంటాయని స్పష్టం చేశారు. 

Also Read :  తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

Also Read :  అయ్యప్ప దీక్షలో డ్యూటీ చేయకండి.. పోలీసు శాఖ సంచలన ఆదేశం

Advertisment
తాజా కథనాలు