తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు కానుంది. సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ తొలివారంలోనే నోటిఫికేషన్ విడుదల చేసి.. నెలఖరులోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 29న కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ తుది నిర్ణయం తీసుకోనున్నారు. బీసీలకు 42 శాతం సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ యోచిస్తోంది.
Also Read: ప్రేమపేరుతో దగ్గరై..పెళ్లి చేసుకుని దూరమై..యువతి ప్రాణం తీసిన లవ్‌స్టోరీ
సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించిన సంగతి తెలిసిందే. అలాగే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చే ఆర్డినెస్స్ సైతం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్ద పెండింగ్‌లో ఉంది. ఇక రాష్ట్రంలో ఆశావాహులు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు.
Also Read: వాషింగ్టన్ తరువాత షికాగో లో సైనిక మోహరింపు..ఆలోచనలో పెంటగాన్