Telangana: ఓరి దేవుడా.. పెరుగులో ఈగలు, బల్లి.. ఎలా అమ్ముతున్నార్రా బాబూ!

తెలంగాణలోని జనగాం జిల్లా రఘనాథపల్లెలో శక్తి మిల్స్ అండ్ మిల్స్ ప్రొడెక్ట్స్‌ సంస్థపై టాస్క్ ఫోర్స్ బృందం తనిఖీలు చేసింది. నిల్వ చేసిన నెయ్యిలో ఈగలు, దోమలు.. పక్కనే చనిపోయిన బల్లిని గుర్తించింది. నాణ్యత లేని 1,700 కిలోల పెరుగును స్వాధీనం చేసుకుంది.

New Update
Jangaon raghunathpally shakti milk and milk products inspection by State level Task Force team

Jangaon raghunathpally shakti milk and milk products inspection by State level Task Force team

తెలంగాణలో రోజు రోజుకు ఆహార భద్రత లోపిస్తోంది. తక్కువ సమయంలో ఎక్కువ సొమ్ము సంపాదించుకోవాలనే ఉద్దేశంతో కొందరు నాణ్యత లేని ఆహారాన్ని తయారుచేసి ప్రజలకు విక్రయిస్తున్నారు. ప్రజలు తినే ఆహారంలో నాణ్యత లేని, ఎక్స్‌పరిడేట్ అయినపోయిన అనేక పదార్థాలను వాడుతున్నారు. 

అయితే దీనిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తరచూ హూటళ్లు, రెస్టారెంట్లపై దాడులు చేస్తు్న్నారు. ఈ క్రమంలో హూటల్, రెస్టారెంట్ల వంట గదిని పరిశీలిస్తున్నారు. ఏమైనా పారిశుద్ధ్య లోపాలు కనిపిస్తే నోటిసులు ఇవ్వడమే కాకుండా వాటిని సీజ్ చేస్తున్నారు. 

పారిశుద్ధ్య లోపం

తాజాగా అలాంటిదే జరిగింది. జనగాం జిల్లా రఘునాథపల్లె మండలంలోని శక్తి మిల్క్ అండ్ మిల్క్ ప్రొడెక్ట్స్‌ సంస్థలో రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ బృందం తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు బయటపెట్టింది. ప్రాసెసింగ్, నిర్వహణ సమయంలో ఆహార నిర్వాహకులు తగినంత పారిశుద్ధ్య చర్యలు పాటించడం లేదని పేర్కొంది. 

నెయ్యిలో ఈగలు, దోమలు

ఈ మేరకు కోల్డ్ స్టోరేజ్ గదిలో అతుకులున్న పైకప్పును గమనించారు. అంతేకాకుండా నిల్వ చేసిన నెయ్యిలో ఈగలు, దోమలు కనిపించాయని అధికారులు తెలిపారు. అలాగే ఆహార పదార్థాల సమీపంలో చనిపోయిన బల్లి కనిపించిందని.. పైకప్పుపై సాలెపురుగుల వలలు గమనించబడ్డాయని అన్నారు. 

తుప్పుతో నిండిన పరికరాలు

ఇవి మాత్రమే కాకుండా అక్కడ పేస్ట్ కంట్రోల్ రికార్డ్స్, వాటర్ అనాలసిస్ రిపోర్ట్స్ కూడా అందుబాటులో లేవని పేర్కొన్నారు. వంటగదిలో పరికరాలన్నీ అపరిశుభ్రంగా, తుప్పు పట్టి ఉన్నాయని అన్నారు. ప్యాక్ చేసిన ఉత్పత్తులపై కొన్ని లేబులింగ్ లోపాలు గుర్తించారు.

Also Read: Karthikeya 3: 'కార్తికేయ-3' పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన డైరెక్టర్ చందూ మొండేటి..!

అలాగే కాలుష్యం, ఫంగల్స్ అటాక్ కారణంగా చెడిపోయిన 720 కిలోల పెరుగును పడేసినట్లు తెలిపారు. ఇంకా మిగిలిన లేబులింగ్ ఉల్లంఘనలు, నాణ్యత లేని అనుమానం కారణంగా 1700 కిలోల పెరుగును సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. దీనిపై చట్టంలోని పలు నిబంధనల ప్రకారం.. చర్యలు తీసుకున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు