పాలకుర్తి నియోజకవర్గంలో విస్తారంగా వర్షాలు, పలు గ్రామాల మధ్య రాకపోకలు బంద్
జనగామ జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు దంచి కొడుతున్నాయి.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల మూలంగా జిల్లాలోని ఆయా మండలాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.దీంతో అప్రమత్తమైన అధికారులు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వాగుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేశారు.అత్యవసరం అయితే తప్పా ప్రజలు ఎవరూ కూడా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరించారు. మరోపక్క అత్యవసర పనులకు వెళ్లాలనుకునే వారు, కూళీ పనులకు వెళ్లే వాళ్లు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు.ఏదేమైన మరో రెండు రోజులు ఆగక తప్పదంటూ పోలీసులు కోరారు.