Fake Baba: పాతబస్తీలో దారుణం..సాంత్వన చేకూర్చుతానని..సొంతం చేసుకున్న ఫేక్‌ బాబా

అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువతికి మంత్రం వేస్తానంటూ..ముగ్గులోకి దింపాడు ఓ ఫేక్ బాబా. దర్గాకు పంపిస్తే అక్కడ మంత్రిస్తే పూర్తిగా కోలుకుంటుందని కుటుంబాన్ని నమ్మించాడు. వారు కూడా అతన్ని నమ్మడంతో  ఆ నకిలీ బాబా ఆమెను తీసుకెళ్లి ఏకంగా వివాహం చేసుకున్నాడు.

New Update
Fake Baba

Fake Baba

Fake Baba: మంత్రాలకు చింతకాయలు రాలవన్నది నానుడి. కానీ, మూడనమ్మకాలతో జనాలు ఇంకా మంత్రగాళ్లను నమ్ముతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా  హైదరాబాద్‌ పాతబస్తీ వంటి ప్రాంతాల్లోనూ ఇంకా ఈ జాఢ్యం కొనసాగుతోంది. తాజాగా అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువతికి మంత్రం వేస్తానంటూ..ముగ్గులోకి దింపాడు ఓ ఫేక్ బాబా. హైదరాబాద్‌ పాతబస్తీ ప్రాంతంలోని నవాబ్ సాహెబ్ కుంటలో ఈ ఘటన జరిగింది. ఈ కేసుకి సంబంధించిన వివరాలను పాత బస్తీ పోలీసులు వెల్లడించారు. 

Also Read: Nani Heroine: నానికి కలిసొచ్చిన హీరోయిన్.. ఈసారి 'జూలియట్' గా మళ్ళీ రొమాన్స్!
 
హైదరాబాద్‌ పాతబస్తీ ప్రాంతంలోని(hyderabad old city woman) నవాబ్ సాహెబ్ కుంటలో ఒక కుటుంబం నివాసం ఉంటుంది. ఆ కుటుంబానికి చెందిన ఒక యువతి అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. అయితే మంత్రాలు వేస్తే ఆరోగ్యం బాగవుతుందని తెలిసి ఆ కుటుంబం ఓ నకిలీ బాబాను ఆశ్రయించింది. ఇదే అదునుగా భావించిన నకిలీ బాబా వారి కుటుంబాన్ని మోసం చేశాడు. యువతికి మంత్రించి  ఆరోగ్యం బాగుచేస్తానని నమ్మించిన ఆ బాబా రోజూ ఇంటికి వస్తుండేవాడు. మంత్రాలు వేస్తే ఆరోగ్యం మెరుగవుతుందనే నమ్మకంతో తల్లిదండ్రులు కూడా అతన్ని నమ్మి ఆ యువతిని ఆయన వద్దకు తరచూ పంపించారు.  ఆ తర్వాత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న యువతిని తన  దర్గాకు పంపిస్తే అక్కడ మంత్రిస్తే పూర్తిగా కోలుకుంటుందని నమ్మించాడు. వారు కూడా అతన్ని నమ్మడంతో  ఆ నకిలీ బాబా ఆమెను తీసుకెళ్లి ఏకంగా వివాహం చేసుకున్నాడు. ఆరోగ్యం కుదుట పడుతుందని దర్గాకు వెళ్లిన కూతురు ఎంతకు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పాతబస్తీ పోలీసులను ఆశ్రయించారు. వారు ఇచ్చిన ఫిర్యాదుతో  పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Also Read:  Snake wife: రాత్రికి రాత్రి పాములా మారిపోతున్న భార్య.. గజగజ వణికిపోతున్న భర్త

అయితే  ఈ లోపు ఆ యువతే తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. తాను మేజర్‌‌ని అని, బాబాను  ప్రేమించి స్వచ్ఛందంగా వివాహం చేసుకున్నానని తేల్చి చెప్పింది. అంతేకాదు సమయం, సందర్భం చూసుకుని తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, అంతా తన ఇష్టపూర్వకంగానే జరిగిందంటూ వారికి క్లారిటీ ఇచ్చింది. యువతి స్వచ్ఛందంగా ఆ నకిలీ బాబాతో  వెళ్లిందని తెలిసిన వెంటనే మిస్సింగ్ కేసును పాత బస్తీ పోలీసులు క్లోజ్‌ చేశారు. అయితే ఇక్కడ బిగ్‌ ట్విస్ట్‌ ఏంటంటే ఆ నకిలీ బాబాకు  ఇది వరకే పెళ్లి కావడమే కాకుండా  ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. త మాయ మాటలు చెప్పి మంత్రాల పేరిట తమ కూతురును  సొంతం చేసుకున్న దొంగ బాబాను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలంటూ యువతి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

Also Read: Bigg Boss Promo: రేలంగి మావయ్య బయటకొచ్చాడు.. భరణికి ఇచ్చి పడేసిన శ్రీజ..! హై వోల్టేజ్ ఎపిసోడ్

Advertisment
తాజా కథనాలు