/rtv/media/media_files/2025/10/08/local-2025-10-08-17-04-42.jpg)
స్థానిక ఎన్నికలపై హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. బీసీ రిజర్వేషన్‌ల పెంపుపై దాఖలైన పిటిషన్ విచారణను రేపటికి హైకోర్టు వాయిదా వేసింది. మధ్యాహ్నం 2:30 గంటలకు వాదనలు వింటామని తెలిపింది. అయితే.. రేపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకుండా స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరగా న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ఈసీ షెడ్యూల్ ప్రకారమే రేపు ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. ఆ వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. రేపు ఉదయం 10.30 గంటలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఈసీ.
హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్లపై విచారణ రేపటికి వాయిదా.
— Neti Telugu (@NetiTeluguNews) October 8, 2025
విచారణను రేపు మధ్యాహ్నం 2.15కు వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు.
రేపు మరిన్ని వాదనలు వినిపిస్తామన్న తెలంగాణ ఏజీ.
రేపటి స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకుండా చూడాలన్న పిటిషనర్ వాదనలను పట్టించుకోని హైకోర్టు.
గత విచారణ సందర్భంగా కూడా షెడ్యూల్ విడుదల చేయకుండా స్టే ఇవ్వాలని కోరగా హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆ మరుసటి రోజే ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 6న సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా కూడా పిటిషనర్లు స్థానిక ఎన్నికలపై స్టే ఇవ్వాలని కోరారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం ఇందుకు నో చెప్పింది.
బ్రేకింగ్....
— Haritha Mudhagouni (@Haritha_Journo) October 8, 2025
రేపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్...
బీసీ రిజర్వేషన్ పై విచారణ రేపటికి వాయిదా
రేపు 2.15 గంటలకు వాయిదా వేసిన తెలంగాణ కోర్టు
రేపు మరిన్ని వాదనలు వినిపిస్తామన్న ఏజీ
రేపటి నోటిఫికేషన్ ఇవ్వకుండా చూడాలన్న పిటిషనర్ వాదనలను పట్టించుకొని హైకోర్టు... pic.twitter.com/QyB5wehPHM
జీవోను సవాల్ చేస్తూ
బీసీ రిజర్వేషన్ల పెంపు వివాదం న్యాయస్థానానికి చేరడంతో స్థానిక ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్న ఉత్కంఠ గత కొన్ని రోజులుగా నెలకొంది. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో చెల్లదని.. దాన్ని కోర్టులు కొట్టి వేస్తాయన్న విశ్లేషణలు కూడా వినిపించాయి. అయితే.. జీవోను సవాల్ చేస్తూ వచ్చిన పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు స్థానిక ఎన్నికలను ఆపేందుకు మాత్రం ఎలాంటి ఆదేశాలు ఇవ్వడం లేదు. దీంతో ఎన్నికలు సజావుగా జరగొచ్చనే చర్చ సాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 42 శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలను నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వానికి హైకోర్టు తాజా ఆదేశాలు ఊరటనిచ్చాయి.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు (ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ) రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఇప్పటికే షెడ్యూల్‌ను విడుదల చేసింది. మూడు విడుతల్లో స్థానిక సంస్థలు జరగనున్నట్టు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.
ఎన్నికల షెడ్యూల్ ఇలా..
- రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.
- అక్టోబర్ 9, 13న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషేన్ విడుదల
- మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు..
- అక్టోబర్ 17, 21, 25 తేదీల్లో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్
- అక్టోబర్ 23న ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి విడత ఎన్నికల పోలింగ్,
- అక్టోబర్ 27న ఎంపీటీసీ, జెడ్పీటీసీ రెండో విడత ఎన్నికలు,
- అక్టోబర్ 31న, నవంబర్ 4, 8 తేదీల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు.
- నవంబర్ 11వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్.
- పోలింగ్ రోజునే గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు.
- ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి దశ నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 11.
- ఎంపీటీసీ, జెడ్పీటీసీ రెండో దశ నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 15.