రాష్ట్రంలో స్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. డబ్బులు కూడా ఇస్తారు..!

ఏపీ ప్రభుత్వం.. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర పథకం కింద కిట్లు అందించేందుకు రెడీ అయింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన కిట్లు అందించేందుకు నిధులు మంజూరు చేశారు.

New Update
AP Govt

ఏపీలో కూటమి ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. విద్యార్థి మిత్ర పథకం కింద కిట్లు అందించేందుకు సిద్ధమైంది. అయితే గత వైసీపీ ప్రభుత్వం మాదిరి కాకుండా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం నాణ్యమైన కిట్లు అందించేందుకు రెడీ అయిందని మంత్రి లోకేష్ అన్నారు. 

also read: ట్రేడింగ్ పేరుతో స్కాం.. హైదరాబాద్ ఐటీ ఉద్యోగికి రూ.2.29 కోట్ల టోకరా

కాగా గత ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు అందించిన కిట్లలో లోపాలు ఉన్నాయనే విమర్శలు ఆ మధ్య వచ్చాయి. అంతేకాకుండా బ్యాగ్ లు, బెల్టులపై పార్టీ రంగులు, ఫొటోలు వేసుకుందని కూటమి ప్రభుత్వం ఆరోపించింది. అయితే ఈ సారి అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు.

also read: సీఎం రేవంత్‌పై కేసు పెట్టాలని పిటిషన్!

సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం

ఇందులో భాగంగానే ఎలాంటి లోపాలు లేకుండా స్కూల్ విద్యార్థులకు కిట్ లు అందించేందుకు సిద్ధమైనట్లు చెప్పారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో చదివే స్టూడెంట్లకు 2025-26 విద్యా సంవత్సరానికి గానూ కిట్లు అందించేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగానే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకానికి అనుమతులు జారీ చేసింది.

also read: 'అమరన్' సక్సెస్ మీట్.. నితిన్ హిట్ సాంగ్ ను తెలుగులో పాడిన శివకార్తికేయన్

అయితే ఈ పథకం కింద కిట్లు అందించేందుకు రూ.953.71 కోట్ల ఖర్చు కానుంది. ఇందులో సగం కేంద్ర అందిస్తుండగా.. మిగతా సగం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించనుంది. దాదాపు రూ.175.03 కోట్ల నిధులు కేంద్రం అందిస్తుండగా.. రూ.778.68 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించనుంది.

also read: నాని - శ్రీకాంత్ ఓదెల మూవీకి డిఫరెంట్ టైటిల్.. అస్సలు ఉహించలేదే

ఈ క్రమంలోనే ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివే దాదాపు 36 లక్షల మంది విద్యార్థులకు కిట్లు అందజేయనున్నారు. ఈ పథకంలో భాగంగా విద్యార్థులకు నోట్ బుక్స్, వర్క్ బుక్స్, పాఠ్య పుస్తకాలు, బ్యాగ్, డిక్షనరీ, బూట్లు, బెల్ట్, మూడు జతల యూనిఫామ్ అందించనున్నారు.

వీటన్నింటికి దాదాపు రూ.1850.50 ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇది మాత్రమే కాకుండా యూనిఫామ్ కుట్టుకూలి కింద ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వారికి రూ.120.. అలాగే 9, 10 తరగతుల వారికి రూ.240 ప్రభుత్వం చెల్లించనుంది. ఈ కిట్లను వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందంచనుంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు