Nani: నాని - శ్రీకాంత్ ఓదెల మూవీకి డిఫరెంట్ టైటిల్.. అస్సలు ఉహించలేదే

నాని, శ్రీకాంత్ ఓదెల మూవీకి 'ది ప్యారడైజ్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ నాని తన ఎక్స్ వేదికగా పోస్టర్ విడుదల చేశారు. పోస్టర్ గమనిస్తే.. టైటిల్ అక్షరాల్లో కింద ఎక్కువ మొత్తంలో గన్నులు కనిపించడంతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.

New Update
sdfv

న్యాచురల్ స్టార్ నాని దసరా పండగ రోజు శ్రీకాంత్ ఓదెలతో కొత్త మూవీని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. 'దసరా' తో భారీ సక్సెస్ అందుకున్న ఈ కాంబోలో తెరకెక్కనున్న రెండో సినిమా ఇది. డైరెక్టర్ శ్రీకాంత్ ఈసారి నాని కోసం సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే  ఓ పీరియాడిక్‌ కథని సిద్ధం చేశారు. 

ది ప్యారడైజ్..

'దసరా' మూవీతో పోలిస్తే వంద రెట్లు అధిక ప్రభావం చూపించే కథ అని ఇప్పటికే మూవీ టీమ్ చెబుతూ వస్తోంది. తాజాగా వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా టైటిల్ ను ఓ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసారు. " ది ప్యారడైజ్" అనే టైటిల్ తో నాని, శ్రీకాంత్ సినిమా తెరకెక్కబోతుంది. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ నాని తన సోషల్ మీడియా వేదికగా పోస్టర్ విడుదల చేశారు. 

Also Read : 'భీమ్లా నాయక్' డైరెక్టర్ లాంచ్ చేసిన 'లగ్గం టైం' ఫస్ట్ లుక్..!

పోస్టర్ గమనిస్తే.. టైటిల్ అక్షరాల్లో కింద ఎక్కువ మొత్తంలో గన్నులు కనిపిస్తున్నాయి. అలాగే టైటిల్ సైతం ఎరుపు రంగులో ఉంది. దీన్ని బట్టి ఈ మూవీ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో సాగే యాక్షన్ డ్రామాగా ఉంటుందని అర్థమవుతుంది. టైటిల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. 

ఈసారి శ్రీకాంత్ ఓదెల నానితో ఎదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. మొత్తానికి టైటిల్ పోస్టర్ తోనే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. కాగా ఈ సినిమాలో నాని సరసన జాన్వీ కపూర్, శ్రద్ధా కపూర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలో ఎవర్ని ఫైనల్ చేస్తారో చూడాలి. 

Also Read :  రానా, తేజ సజ్జా పై మహేష్ ఫ్యాన్స్ ఫైర్.. క్షమాపణ చెప్పాల్సిందే అంటూ?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు