తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ నిర్వహణ కోసం ప్రభుత్వం నుంచి రూ.100 కోట్లు కేటాయిస్తామని సీఎం రేవంత్ ప్రకటన చేశారు. వర్శిటీ పూర్తిస్థాయి నిర్వహణకు కార్పస్‌ఫండ్ ఏర్పాటు చేసేందుకు ముందుకురావాలని కోరారు. గురువారం సచివాలయంలో తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ బోర్డుతో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు, వర్శిటీ బోర్డు ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర సహా వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Also Read: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. దసరా సెలవులు ఎప్పటినుంచంటే ?
యూనివర్శిటీ నిర్వహణ కోసం ఎవరికి తోచినంత వారు సహకారం అందించాలని సీఎం రేవంత్ కోరారు. ఈ ఏడాది నుంచే స్కిల్ యూనివర్శిటీలో ప్రారంభించే వివిధ కోర్సులతో పాటు కీలక అంశాలను పారిశ్రామికవేత్తలకు అధికారులు వివరించారు. మరోవైపు తెలంగాణ నుంచి స్కిల్స్ కలిగిన యువతను ప్రపంచానికి అందించాలన్న ముఖ్యమంత్రి ఆలోచన గొప్పదని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహాంద్రా ప్రశంసించారు. సీఎం రేవంత్ మంచి విజన్ ఉన్న నాయకుడు అంటూ కొనియాడారు. అందుకే వర్శిటీ బోర్డు ఛైర్మన్‌గా ఉండాలని ఆయన కోరగానే వెంటనే అంగీకరించానని పేర్కొన్నారు.