Telangana: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. దసరా సెలవులు ఎప్పటినుంచంటే ? ఈ ఏడాది తెలంగాణలో దసరా సెలవులు 13 రోజులు రానున్నాయి. అక్టోబర్ 2 నుంచి 14వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. మళ్లీ అక్టోబర్ 15న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. By B Aravind 19 Sep 2024 | నవీకరించబడింది పై 19 Sep 2024 20:14 IST in తెలంగాణ ఆదిలాబాద్ New Update షేర్ చేయండి అక్టోబర్ వస్తుందంటే చాలు. ఆ నెలలో వచ్చే దసరా పండుగ కోసం అందరూ ఎదురుచూస్తుంటారు. ఇక విద్యార్థులైతే దసరా సెలవుల కోసం ఎదురుచూస్తుంటారు. అయితే ఈ ఏడాది తెలంగాణలో దసరా సెలవులు 13 రోజులు రానున్నాయి. అక్టోబర్ 2 నుంచి 14వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. మళ్లీ అక్టోబర్ 15న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతితో సెలువులు మొదలుకానున్నాయి. ఆ తర్వాత బతుకమ్మ, దసరా సెలవులు ఉంటాయని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు వివరించారు. Also Read: ఉద్యోగస్తులకు షాక్ ఇచ్చిన యాక్సెంచర్.. కంపెనీలో అసలేం జరుగుతోంది? మరోవైపు కొన్ని ప్రైవేట్ పాఠశాలలైతే అక్టోబర్ 1వ తేదీ నుంచి దసరా సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించాయి. మళ్లీ అక్టోబర్ 15న తిరిగి పాఠశాలలు ప్రారంభమవుతాయని విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం పంపించాయి. వరుసగా 13 రోజులు సెలవులు రావడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దూరంగా ఉండి చదువుకునే విద్యార్థులు ఊర్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలాఉండగా.. తెలంగాణ ప్రభుత్వం మే 25న 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్‌ను రిలీజ్ చేసింది. అక్టోబర్ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు, డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్‌మస్ సెలవులు, అలాగే జనవరి 13 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించారు. 2025 ఏప్రిల్ 23వ తేదీ వరకు పాఠశాలలు కొనసాగననున్నాయి. ఇక 2025 ఫిబ్రవరిలో పదో తరగతి ప్రీ ఫైనల్, మార్చిలో వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. #telugu-news #telangana #dasara-holidays మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి