తెలంగాణ పర్యాటక రంగ అభివృద్ధికి కొత్త ప్లాన్: మంత్రి జూపల్లి

తెలంగాణలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు కదులుతోంది. రాష్ట్రానికి వచ్చేవారు పర్యాటక ప్రదేశాలు సందర్శించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. త్వర‌లోనే ఓ క‌మిటీ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు.

jupally
New Update

తెలంగాణలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు కదులుతోంది. రాష్ట్రానికి వచ్చే దేశ విదేశీయులు, పర్యాటక, సాంస్కృతిక, వారసత్వ కట్టడాలను సందర్శించేలా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టనున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కార్యచ‌ర‌ణ రూపొందిస్తున్నామ‌ని పేర్కొన్నారు.  త్వర‌లోనే ఓ క‌మిటీ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో నిర్వహించిన ట్రవెర్నియా ఫెస్ట్‌కు ముఖ్య అతిథిగా ఆయన హాజ‌ర‌య్యారు.

Also Read: మోదీకి బిగ్ షాక్.. ఎన్నికలకు ముందు అధికార మహాయుతి కుటమిలో విభేదాలు

జ్యోతిప్రజ్వాల‌న చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప‌ర్యాట‌క‌, వార‌స‌త్వ, చారిత్రక ప్రాంతాలు, వివిధ ప్రాంతాల ప్రజ‌ల  జీవ‌న శైలి, ఆహార‌పు అల‌వాట్లు, సంస్కృతి, సంప్రదాయ‌ల‌ను గురించి ప‌ర్యాట‌క ప్రేమికుల‌కు  తెలియ‌జేయ‌డమే ల‌క్ష్యంగా ఈ ట్రవేర్నియా ఫెస్ట్ ను నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి జూప‌ల్లి మాట్లాడుతూ.. "సీఎం రేవంత్ రెడ్డి సార‌థ్యంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ ప‌ర్యాట‌క రంగానికి పెద్దపీఠ వేసింది. ప‌ర్యాట‌కుల‌తో పాటు జాతీయ‌, అంత‌ర్జాతీయ స‌ద‌స్సులు, స‌మావేశాలు, అధికారిక‌ కార్యక్రమాలు, ఆయా ప‌నుల నిమిత్తం తెలంగాణ‌కు వ‌చ్చే వారిని ప‌ర్యాట‌క ప్రాంతాల‌కు తీసుకువెళ్లేందుకు అనేక ప‌థ‌కాలు చేప‌డుతున్నాం. వ‌చ్చిన ప్రతీ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటూ.. తెలంగాణ టూరిజం ప్రమోష‌న్ కోసం కృషి చేస్తున్నాం. తెలంగాణ ప‌ర్యాట‌క ప్రాంతాల‌ను సంద‌ర్శించి, టూరిజం ప్రమోష‌న్‌కు అంబాసిడ‌ర్లుగా నిల‌వాల‌ని కోరుతున్నామ‌ని'' జూపల్లి అన్నారు. 

Also Read: టాటూ వేయించుకున్న 68 మంది మహిళలకు ఎయిడ్స్!

ఈ కార్యక్రమంలో యూఎన్ టూరిజం అంబాసిడ‌ర్ కార్ల్ జోషువా, ప్రముఖ చరిత్రకారుడు డా. సిన్హారాజా త‌మ్మిట‌, ట్రవేర్నియా ఫెస్ట్ వ్యవ‌స్తాప‌కులు డా. అంతొని విపిన్ దాస్, ర‌వాణా ప‌రిశ్రమ, ట్రావెల్ ఎజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Also Read: మహారాష్ట్రలో జోరుగా ఎన్నికల తనిఖీ..అమిత్ షా హెలికాప్టర్ కూడా

#telangana #national-news #tourism
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe