Amit Shah:మహారాష్ట్రలో జోరుగా ఎన్నికల తనిఖీ..అమిత్ షా హెలికాప్టర్ కూడా

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ఎంత జోరుగా సాగుతోందో...అక్కడ డబ్బులు కూడా అంతే వేగంగా పంపిణీ అవుతున్నాయి. దీంతో ఈసీ ముమ్మరంగా తనిఖీలు చేస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెలికాప్టర్‌‌ను కూడా ఈరోజు తనిఖీ చేశారు. 

New Update
m

మహారాష్ట్ర ఎన్నికల వేళ ప్రచారంలో పాల్గొంటున్న నేతల బ్యాగులు, హెలీకాప్టర్లతో సహా మొత్తం అన్నీ తనిఖీలు చేస్తోంది ఎన్నికల కమిషన్. పెద్దా, చిన్నా అని కూడా చూడడం లేదు. దీనికి కారణం ఇటీవల మహారాష్ట్రలో పెద్ద ఎత్తున డబ్బులు, ఇతరత్రా దొరకడమే కారణం. ఈరోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెలికాఫ్టర్‌‌ను కూడా తనిఖీ చేశారు అధికారులు. ఈ విషయాన్ని స్వయంగా అమిత్ షా నే తన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 

Also Read :  లెబనాన్‌, గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్‌.. వీడియోలు చూస్తే హడలిపోవాల్సిందే

Amith Shah - Election Commission

ఎన్నికల ప్రచారం కోసం ఇక్కడకు వచ్చిన నా హెలికాప్టర్‌ను అధికారులు తనిఖీ చేశారు. నిష్పక్షపాత, ఆరోగ్యకరమైన ఎన్నికల వ్యవస్థను బీజేపీ నమ్ముతుంది, ఆదరిస్తుంది అని అమి షా పోస్ట్‌లో రావారు. ఈసీకి మనమంతా సహకరించాలని ఆయన అన్నారు. ప్రపంచంలో శక్తిమంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థగా భారత్‌ను కొనసాగించడంలో మన బాధ్యతలను నిర్వర్తించాలి అని అమిత్‌ షా ఎక్స్‌లో రాసుకొచ్చారు. 

Also Read :  Snakes: ఆ దీవిలో అడుగడుగునా మనిషిని మింగేసే పాములు.. కళ్లు మూశారో ఖతం!

ఇక రీసెంట్‌గా మహారాష్ట్ర ఆజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠక్రే బ్యాగును పదేపదే ఈసీ అధికారులు తనిఖీ చేయడం చర్చనీయంగా మారింది. కావాలనే విక్ష నేతల వస్తువులను తనిఖీఉ చేస్తున్నారంటూ విమర్శించారు. అయితే ఈసీ మాత్రం ఎవరేమన్నా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతోంది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే, డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌,  కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బ్యాగులను కూడా అధికారులు తనిఖీ చేశారు. మహారాష్ట్రలో నవంబర్‌ 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Also Read :   పవన్‌పై బన్నీ సంచలన వ్యాఖ్యలు.. అన్‌స్టాపబుల్‌ షోలో బాలకృష్ణతో అల్లు అర్జున్ రచ్చ రచ్చ!

Also Read :  Crime: టేపుతో కట్టేసి.. క్రికెట్‌ బ్యాట్‌తో కొట్టి.. ఎముకలు విరగొట్టి.. వెలుగులోకి సంచలన నిజాలు!

Advertisment
తాజా కథనాలు