మోదీకి బిగ్ షాక్.. ఎన్నికలకు ముందు అధికార మహాయుతి కుటమిలో విభేదాలు మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార మహాయుతి కూటమిలో విభేదాలు రావడం దుమారం రేపుతోంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం కావడం గమనార్హం. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 15 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గరికొస్తున్నాయి. ఈ సమయంలో మహాయుతి కూటమిలో విభేదాలు రావడం దుమారం రేపుతోంది. ఇటీవల ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం కావడం గమనార్హం. ఇటీవల మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో భాగంగా యోగీ ఓ నినాదం ఇచ్చారు. ప్రజలను ఉద్దేశిస్తూ ‘బాటేంగే తో కటేంగే’ (విడిపోతే పడిపోతాం) అని అన్నారు. ఈ నినాదాన్ని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తీవ్రంగా వ్యతిరేకించారు. పవార్ తీరుపై మరో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా తీవ్రంగా స్పందించారు. ఈ నినాదాన్ని అజిత్ పవార్ అర్థం చేసుకోవాలని సూచించారు. దీంతో అధికార మహాయుతీ కూటమిలో ప్రస్తుతం ప్రకంపనలు రేపుతున్నాయి. Also Read: టాటూ వేయించుకున్న 68 మంది మహిళలకు ఎయిడ్స్! ఇక వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలో బీజేపీ స్టార్ ప్రచారకర్తగా యోగీ ఆదిత్యనాథ్ ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు. ఇటీవల ఓ ర్యాలీలో ప్రజలనుద్దేశిస్తూ మాట్లాడుతూ.. విడిపోతే పడిపోతాం అనే అర్థం ఇచ్చేలా నినాదం చేశారు. గతంలో కూడా ఈయన పలుసార్లు ఈ నినాదాన్ని వాడారు. అయితే ఈ వ్యాఖ్యలపై సొంత నేతల నుంచే వ్యతిరేకత వస్తోంది. యోగీ వ్యాఖ్యలపై అజిత్ పవార్ తీవ్రంగా స్పందించారు. ఈ నినాదాన్ని నేను సమర్థించను. ఇప్పటికే చాలాసార్లు దీని గురించి చెప్పాను. ఈ నినాదం ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో పనిచేస్తుందేమో కానీ.. అంబేద్కర్ సూత్రాలు పాటించే మహారాష్ట్ర నేలపై దీనికి స్థానం లేదని అన్నారు. మరోవైపు బీజేపీ నేత పంకజ ముండే కూడా ఈ నినాదాన్ని వ్యతిరేకించారు. Also Read: మహారాష్ట్రలో జోరుగా ఎన్నికల తనిఖీ..అమిత్ షా హెలికాప్టర్ కూడా అయితే తాజాగా అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా స్పందించారు. '' అజిత్ పవార్ కొన్ని దశాబ్దాల పాటుగా హిందూ వ్యతిరేక సిద్ధాంతాలతో పనిచేశారు. అందుకే ఇంకా ఆయనపై మాజీ మిత్రుల (కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ) ప్రభావం ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రజల నాడిని అర్థం చేసుకునేందుకు ఆయనకు ఇంకా కొంత సమయం పడుతుందని'' ఫడ్నవీస్ అన్నారు. ఎన్నికలకు ముందు ఇలా అధికార మహాయుతీ కుటమిలో విభేదాలు రావడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. ఇదిలాఉండగా.. మహారాష్ట్రలో నవంబర్ 20న ఎన్నికలు జరగనుండగా.. 23న ఝార్ఖండ్‌తో పాటు ఓట్ల లెక్కింపు జరగనుంది. #maharashtra-elections #national-news #bjp #telugu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి