TG News: 5 లక్షల మందికి ‘రాజీవ్ యువవికాసం’.. 3 నెలల్లో యూనిట్లు, రూ.2 వేల కోట్లు ఖర్చు!

'రాజీవ్‌ యువవికాసం పథకం' అమలులో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగ యువతకు స్వయంఉపాధి కల్పించే లక్ష్యంతో మొదట 5లక్షల మందికి జూన్‌ 2న  రూ.4 లక్షల విలువైన యూనిట్లు మంజూరు చేయనున్నారు. ఇందుకు రూ.2 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు.  

New Update
cm rvnt

Telangana govt key decision on 'Rajeev Youth Development Scheme'

TG News: 'రాజీవ్‌ యువవికాసం పథకం' అమలులో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగ యువతకు స్వయంఉపాధి కల్పించే లక్ష్యంతో మొదట 5లక్షల మందికి జూన్‌ 2న  రూ.4 లక్షల విలువైన యూనిట్లు మంజూరు చేయనున్నారు. ఇందుకు రూ.2 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు.  

16.20 లక్షల దరఖాస్తులు

ఈ మేరకు 3 నెలల్లో యూనిట్లు గ్రౌండింగ్‌ చేయాలని రేవంత్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వీటిని పంపిణీ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిశీలన మొదలవగా మే 25 నాటికి మంత్రుల అనుమతితో లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేయనున్నారు. ఈ పథకం కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 16.20 లక్షల దరఖాస్తులు రాగా.. 5 లక్షల మందికి రూ.4 లక్షల యూనిట్లు మంజూరు చేయనున్నారు. ఇక రూ.లక్ష లోపు రుణాల కోసం వచ్చిన దరఖాస్తులు తక్కువగా ఉన్నాయని, రూ.1-2 లక్షలు నుంచి రూ.2-4 లక్షల యూనిట్ల కేటగిరీ రుణాలకు భారీగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. 

ఇది కూడా చూడండి: Windsor Pro electric SUV: కళ్ళు చెదిరే బుకింగ్స్.. వండర్స్ క్రియేట్ చేస్తున్న 'విండ్సర్ ప్రో' బ్రాండ్ న్యూ కార్..

వారంతా అనర్హులే..

ఎస్సీ కార్పొరేషన్‌కు రూ.2-4 లక్షల యూనిట్లు 20 వేలు మంజూరు చేస్తే ఇందులో 3.24 లక్షల మంది పోటీపడుతున్నారు. బీసీ కార్పొరేషన్‌ కింద 22 వేల యూనిట్ల కోసం 6.66 లక్షల మంది, ఈబీసీల్లో 8 వేల యూనిట్ల కోసం 32 వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. దీంతో దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. కుటుంబంలో ఒక్కరికే స్వయంఉపాధి పథకం మంజూరు చేయనున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఒకసారి సంక్షేమ కార్పొరేషన్‌ లబ్ధి పొందినవారు 5 ఏళ్లపాటు మరో రుణం పొందేందుకు అనర్హులే. డేటాబేస్‌తో దరఖాస్తులను పరిశీలించి అనర్హులను తొలగిస్తున్నారు. 

cm revanth | telangana | Rajiv Yuva Vikasam | telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు