/rtv/media/media_files/2025/04/12/NZV8mNQJxjDVBBHL9Tiz.jpg)
solar project
Solar: ఇళ్లపై సోలార్ పవర్ ప్రాజెక్టులు పెట్టుకోవాలనుకునేవారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం సూర్యఘర్ ముఫ్తి బిజిలీ యోజన కింద 2027 మార్చి నాటికి 20 లక్షల ఇళ్లపై 2 కిలోవాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా 4 వేల మెగావాట్ల కరెంట్ అదనంగా అందించవచ్చని అంచనా వేస్తోంది. 3 కిలోవాట్ల ప్రాజెక్టుల వరకు కేంద్రం రాయితీ ఇవ్వనుండగా మిగిలినది బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ పథకానికి సంబంధించిన రుణాలను పొందాలనుకునేవారికి జాతీయ పోర్టల్‌లోనే బ్యాంకులు, ఆర్థిక సంస్థల వివరాలు అందుబాటులో ఉన్నాయి.
ప్రాజెక్టుకోసం రూ.1.10 లక్షలు ఖర్చు
ఈ మే రకు 2 కి.వా ప్రాజెక్టుకోసం రూ.1.10 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. కేంద్రం ప్రభుత్వ రాయితీ రూ.60 వేలు అందించనుడగా మిగిలిన 50 వేలు వినియోగదారులే భరించాలి. 2 కి.వా ప్రాజెక్టు ద్వారా నెలకు 240 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అందులో ఇంటి అవసరాలకు మిగిలినది గ్రిడ్‌కు తరలిస్తారు. ప్రతినెలా గ్రిడ్‌కు అందించిన కరెంట్ యూనిట్లను లెక్కించి, డిస్కంలు యూనిట్‌కు రూ.2.09 చొప్పున వినియోగదారులకు ఇస్తాయి.
దరఖాస్తు ప్రక్రియ..
మొదట వెయ్యి రూపాయలతో జాతీయ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కరెంటు బిల్, బ్యాంకు వివరాలు, అడ్రస్ ఫ్రూఫ్ తో కూడిన డిస్కంకు దరఖాస్తు సమర్పించాలి. రిజిస్ట్రేషన్ తర్వాత ఎం-ప్యానల్ కంపెనీల వివరాల కనపడగానే ఒక కంపెనీని సెలక్ట్ చేసుకోవాలి. వెండార్‌తో అగ్రిమెంట్ కాగానే రాయితీ పోనూ, మిగిలిన మొత్తాన్ని బ్యాంకు నుంచి రుణంగా పొందే ఆప్షన్ ఎంచుకోవాలి. ఇక ప్రాజెక్టు పూర్తికాగానే ఇందుకు సంబంధించిన ఫొటోలు అప్‌లోడ్ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తైన 15 రోజుల్లో కేంద్రం అందిచే రాయితీ బ్యాంకు ఖాతాలో పడుతుంది.
ఇది కూడా చూడండి: Hyderabad Mandi Biryani: హైదరాబాద్ వాసులకు 'ఫ్రీ మండి' బిర్యానీ.. ఎలాంటి షరతులూ లేవు..
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ గృహాలకు ప్రతినెలా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తోంది. ఇందులో 20.18 లక్షల విద్యుత్ కనెక్షన్లుండగా.. కొత్తగా ఏర్పాటుచేసే 2 కి.వా ప్రాజెక్టులకు కేంద్రం ఇచ్చే రాయితీ రూ.60 వేలు పోనూ ఒక్కో కనెక్షన్‌కు అదనంగా రూ.50 వేలు రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఈ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు అవకాశమున్న ఇళ్లను అధికారులు ఇప్పటికే గుర్తించి దరఖాస్తు చేయిస్తున్నట్లు సమాచారం.
ఇది కూడా చూడండి: Brain Health: ఈ అలవాట్లు వెంటనే మానెయ్ లేదంటే బ్రెయిన్ షెడ్డుకే..!
solar-power | modi | telugu-news