/rtv/media/media_files/2025/04/21/R8vcHZt7uO4cv55btBNm.jpg)
tg japan Photograph: (tg japan)
Japan: జపాన్‌తో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంటోంది. హైదరాబాద్‌లో ఎకోటౌన్ ఏర్పాటుకు ఈఎక్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, పీ9 ఎల్‌ఎల్‌సీ, నిప్పాన్ స్టీల్ ఇంజినీరింగ్, న్యూ కెమికల్ ట్రేడింగ్, అమితా హోల్డింగ్స్ సంస్థలతో ఒప్పందాలు కుదిరాయి. జపాన్ పర్యటనలో భాగంగా తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పర్యావరణహిత కిటాక్యూషు నగరాన్ని సందర్శించింది.
హోల్డింగ్స్ సంస్థలతో ఒప్పందం..
ఈ మేరకు ఆదివారం కిటాక్యూషు సిటీ మేయర్ కజుహిసా టేకుచితో సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అధికారులు భేటీ అయ్యారు. పర్యావరణ అనుకూల సాంకేతికతలు, పరిశుభ్రనగరాలు, నదుల పునరుజ్జీవపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటు అంగీకారం చేసుకున్నారు. ఈఎక్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, పీ9 ఎల్‌ఎల్‌సీ, నిప్పాన్ స్టీల్ ఇంజినీరింగ్, న్యూ కెమికల్ ట్రేడింగ్, అమితా హోల్డింగ్స్ సంస్థలతో ఒప్పందం కుదిరింది. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో లెటర్స్ ఆఫ్ ఇంటెంట్‌పై అధికారులు, కంపెనీల ప్రతినిధులు సంతకాలు చేశారు.
ఇది కూడా చదవండి: వీర్యం తెలుపుకు బదులుగా పసుపులో ఉందా..కారణం ఇదే
అలాగే హైదరాబాద్‌లో జపనీస్ భాషా పాఠశాల ఏర్పాటు చేసే ప్రతిపాదనను ప్రస్తావించారు. జపాన్‌లో యువ శక్తి అవసరం ఎక్కువగా ఉందని, తెలంగాణ యువతకు జపనీస్ భాషలో నైపుణ్యం కల్పిస్తే వారికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని సీఎం రేవంత్ అన్నారు. ఉపాధి కల్పన, అభివృద్ధి, సంపద సృష్టి, పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. హైదరాబాద్‌లో ఎకో టౌన్ అభివృద్ధి చేయటం ద్వారా.. భవిష్యత్తు తరాలకు ఆహ్లాదకరమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించగలమనే విశ్వాసం ఉంద అని సీఎం రేవంత్ చెప్పారు. ఇక పరిశ్రమల అభివృద్ధికి తెలంగాణ అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా వృద్ధి చెందిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, పారదర్శక పాలన జపాన్ కంపెనీల పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయని చెప్పారు.
ఇది కూడా చదవండి: శరీరంలో కనిపిస్తే ఈ లక్షణాలు ఉంటే అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్టే
cm revanth | business | telugu-news | today telugu news