/rtv/media/media_files/2025/04/27/j6vEkIaE5i6XqB2O2tg7.jpg)
Telangana government prepared Indiramma houses eligible list
Indiramma illu: ఇందిరమ్మ ఇళ్ల అర్హుల జాబితాను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేసింది. ‘ప్రజాపాలన’లో వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో 77.18 లక్షల మంది ఇళ్ల కోసం అప్లై చేసుకున్నట్లు వెల్లడించింది. అయితే ఇందులో 36.03 లక్షల (46.7 శాతం) మంది అర్హులు కాగా.. 41.15 లక్షల (53.3 శాతం) మందిని అనర్హులుగా గుర్తించింది.
Also Read : స్టేజిపైనే ఆమెకు ప్రపోజ్ చేసిన డైరెక్టర్.. డైరెక్ట్ పెళ్లే అనడంతో కన్నీళ్లు పెట్టుకున్న యువతి (వీడియో)
క్షేత్రస్థాయిలో పరిశీలించి..
ఈ మేరకు అర్హులు, అనర్హుల వివరాలను గృహ నిర్మాణశాఖ L-1, L-2, L-3 లిస్ట్ తయారు చేసింది. ప్రతి ఆర్థిక సంవత్సరం ఒక నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్రం మొత్తం 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేయనుంది. L-1లో 23.05 లక్షలు, L-2లో 21.44 లక్షలు, L-3లో 32.69 లక్షల దరఖాస్తుదారులున్నారు. L-1 జాబితాలో సొంత స్థలాలు ఉండి ఇళ్లు లేని వారితోపాటు సొంత స్థలంలో పూరిళ్లు, మట్టిమిద్దెలు, రేకుల ఇళ్లు ఉన్నవారిని కూడా చేర్చారు. L-2 జాబితాలో భూమి, ఇళ్లు లేని వారుండగా.. L-3లో ప్రభుత్వ ఉద్యోగులు, సొంత ఇళ్లు, కారు, దారిద్య్రరేఖ(BPL)కు ఎగువన ఉన్నవారు, ఆదాయపుపన్ను చెల్లిస్తున్న వారిని చేర్చారు. అయితే ఫిబ్రవరిలోనే ఈ లిస్ట్ తయారు చేయగా పలు ఫిర్యాదులు రావడంతో మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించి అనర్హుల జాబితా తయారు చేశారు.
అయితే గ్రామాలు, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ, పురపాలక ఈ జాబితాప్రకారం.. L-3లో 32.69 లక్షల మంది ఉన్నట్లు గృహనిర్మాణశాఖ గుర్తించింది. తాజా సర్వేలో అనర్హుల సంఖ్య 41.15 లక్షలకు పెరిగిందని, నిబంధనల ప్రకారం L3 జాబితాలో చేర్చిన వారంతా అనర్హులేనని వెల్లడించింది. L-1 జాబితాలో 18.67 లక్షల మంది, L-2లో 17.36 లక్షల మంది అర్హులున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
Also Read : స్కూల్ సిలబస్‌లో భారీ మార్పులు.. ఆ రాజుల చరిత్ర మాయం!
cm revanth | today telugu news