Telangana Liquor Price: తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న మద్యం ధరలు.. ఎంతంటే?

తెలంగాణలో మందుబాబులకు షాక్ తగలనుంది. మద్యం ధరలను భారీగా పెంచేందుకు ప్రభుత్వం రెడీ అయినట్లు తెలుస్తోంది. ప్రీమియం బ్రాండ్స్, బీర్లపై 15% ధరలు పెంచేందుకు ఎక్సైజ్ శాఖ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి నుంచి ఈ ధరలను పెంచాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.

New Update
telangana government liquor price increase soon considers 15 percentage

telangana government liquor price increase soon considers 15 percentage

తెలంగాణలో మందుబాబులకు గట్టి షాక్ తగలనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం ధరలను భారీగా పెంచేందుకు ప్రభుత్వ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పెంపు ధరలను వచ్చే నెల అంటే ఫిబ్రవరి నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఎక్సైజ్ శాఖ ఇప్పటికే కసరత్తు కంప్లీట్ చేసినట్లు సమాచారం. 

Also Read :  నరకం లాంటి జైల్లో వలసదారుల్ని వేస్తాం: ట్రంప్‌!

ఈ మేరకు ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. ఆ నివేదికలో మద్యం ధరలు పెంచాలంటూ పేర్కొన్నట్లు సమాచారం. వచ్చే నెల ఫిబ్రవరి నుంచి మద్యం ధరలను పెంచాలని ఎక్సైజ్ శాఖకు త్రిసభ్య కమిటీ నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. ఈ మేరకు బ్రాండెడ్ మద్యం, బ్రాండెడ్ బీర్లు, చీప్ లిక్కర్ ధరలు పెంచాలని త్రిసభ్య కమిటీ సిఫార్సు చేసినట్లు సమాచారం. 

Also Read :  అమెరికాలో ఘోర ప్రమాదం.. ఢీ కొన్న విమానం, హెలికాఫ్టర్

15 శాతం వరకు పెరిగే ఛాన్స్

ఇదే అంశంపై గత నాలుగైదు రోజులుగా ఎక్సైజ్ అధికారులు సచివాలయంలో సమావేశమై చర్చించినట్లు తెలిసింది. ఇందులో ప్రీమియం బ్రాండ్స్ అలాగే బీర్లపై దాదాపు 15 శాతం వరకు ధరలు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇక చీప్ లిక్కర్ రేట్లను మాత్రం తక్కువ శాతం పెంచాలని డిసైడ్ అయినట్లు తెలిసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం మరికొద్ది రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది. 

Also Read :  తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడంటే..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు