TG News: ప్లాట్ల రిజిస్ట్రేషన్ పై రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. భారీ డిస్కౌంట్!

తెలంగాణ ప్రభుత్వం గత 4ఏళ్లుగా రిజిస్ట్రేషన్‌ కాని ప్లాట్లకు రిజిస్ట్రేషన్‌లో రాయితీ కల్పించింది. మార్చి 31లోగా 25శాతం డిస్కౌంట్‌తో ప్లాట్ల రిజిస్ట్రేషన్ నేరుగా సబ్ రిజిస్ట్రర్ ఆఫీస్‌లోనే అవకాశం కల్పించింది. LRS పథకం అమలులో ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది.

New Update
Telangana LRS: ఎల్ఆర్ఎస్ కు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. మార్గదర్శకాలివే!

తెలంగాణ సర్కార్ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. LRS పథకం అమలులో భాగంగా ప్లాట్ల రిజిస్టేషన్‌కు భారీ డిస్కౌంట్ ప్రకటించింది. గత నాలుగేళ్లుగా పెండింగులో ఉన్న ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు LRS ఫీజులో 25 శాతం రాయితీ ఇవ్వనుంది. సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లోనే 25శాతం డిస్కౌంట్‌పోగా మిగిలిన ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించింది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారిలతో బుధవారం ఈ అంశంపై సమావేశం నిర్వహించారు. LRS పథకం అమలును వేగవంతంగా చేయాలని అధికారులను ఆదేశించారు.

Also Read :  రేప్‌లు చేసి బయటకొచ్చి.. మళ్లీ రేప్ చేశాడు... చివరకు కుంభమేళాకు వెళ్తుండగా

Also Read :  ఒంటరితనం భయంకరంగా ఉందట.. రెండో పెళ్లిపై హింట్ ఇచ్చిన సమంత

Revanth Reddy About Plot Registration

మార్చి 31లోగా ఈ రిజిస్ట్రేషన్ చేయించుకునే వారికే ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. అనుమతి లేని లే అవుట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్‌పై గత ప్రభుత్వం నిషేదం విధించిన విషయం తెలిసిందే. దీంతో వాటిని కొనుగోలు చేసిన వారికి నాలుగేళ్లుగా రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. వారికి ప్రస్తుత ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ.. ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు వెసులు బాటు కల్పించింది. వ్యక్తిగతంగా ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ పెండింగ్‌ ఉన్న వారితోపాటు.. లే అవుట్ల విక్రమం కాకుండా పెద్ద సంఖ్యలో మిగిలిన ప్లాట్లకు కూడా క్రమబద్దీకరణ పథకం అమలయ్యేలా వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. ఇప్పటి వరకు ప్లాట్లు కొనుగోలు చేసిన వారు డ్యాకుమెంట్స్ ఉంటే మార్చి 31లోగా 25శాతం రాయితీతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపింది ప్రభుత్వం.

Also read :కేసీఆర్ పై కేసు వేసిన వ్యక్తి మర్డర్.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!

Also Read :  ఢిల్లీ కొత్త సీఎం సంచలన నిర్ణయం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు