BIG BREAKING :  ఢిల్లీకి కాబోయే కొత్త సీఎం సంచలన నిర్ణయం!

ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేఖా గుప్తా కీలక ప్రకటన చేశారు.  అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు  మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు.  మార్చి 8 లోపు నగదు జమ అవుతుందని రేఖా గుప్తా చెప్పారు.

New Update
rekha guptha

rekha guptha Photograph: (rekha guptha)

మరికాసేపట్లో ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేఖా గుప్తా కీలక ప్రకటన చేశారు.  అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు  మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు.  మార్చి 8 లోపు అర్హులైన మహిళల  ఖాతాల్లో నగదు జమ అవుతుందని రేఖా గుప్తా చెప్పారు. ఇక తాను ప్రజల  మధ్యే ఉంటానని చెప్పారు. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిర్మించిన అద్దాల మేడ శీశ్ మహాల్  ను మ్యూజియంగా మారుస్తామని చెప్పారు.  గత ఆప్ ప్రభుత్వాన్ని ఆమె విమర్శిస్తూ ప్రతి పైసాకు ఆప్ ప్రజలకు లెక్క చెప్పాల్సి ఉంటుందని అన్నారు. రాంలీలా మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు, గుప్తా కాశ్మీరీ గేట్ వద్ద ఉన్న శ్రీ మార్గట్ వాలే హనుమాన్ బాబా ఆలయాన్ని సందర్శించారు.  కాగా ఎన్నికలకు ముందు బీజేపీ తన మ్యానిఫెస్టోలో అధికారంలోకి వస్తే  రూ.2,500 ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించగా.. ఆమ్ ఆద్మీ పార్టీ  రూ.2,100 మద్దతు ఇస్తామని ప్రకటించింది.

అసెంబ్లీ స్పీకర్ గా  విజేందర్ గుప్తా 

ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి ముందు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పేర్లను కూడా ప్రకటించింది. ఢిల్లీ బీజేపీ మాజీ అధ్యక్షుడు విజేందర్ గుప్తా అసెంబ్లీ స్పీకర్‌గా వ్యవహరించనున్నారు. పార్టీ డిప్యూటీ స్పీకర్ పదవికి మోహన్ సింగ్ బిష్ట్ పేరును ప్రకటించింది. మోహన్ సింగ్ బిష్ట్ ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.  ఈసారి ఆయన ముస్తఫాబాద్ వంటి అసెంబ్లీ స్థానం నుండి గెలిచారు. విజేంద్ర గుప్తా రోహిణి అసెంబ్లీ స్థానం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో, విజేంద్ర గుప్తా తన సమీప ప్రత్యర్థి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ప్రదీప్ మిట్టల్‌ను దాదాపు 38 వేల ఓట్ల భారీ తేడాతో ఓడించారు.

సీఎంతో పాటుగా ఆరుగురు మంత్రలు

 సీఎం రేఖా గుప్తాతో పాటుగా ఆరుగురు మంత్రలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు, ఢిల్లీ కేబినెట్‌లో ఉండే మంత్రుల జాబితా రిలీజ్ అయింది. మంత్రుల జాబితాలో ముఖ్యమంత్రి రేసులో నిలిచిన ప్రవేశ్ వర్మ, ఆశిష్ సూద్, మంజీందర్ సింగ్ సిర్సా, కపిల్ మిశ్రా, పంకజ్ సింగ్, రవీంద్ర రాజ్ పేర్లు ఉన్నాయి. ప్రమాణ స్వీకారం అనంతరం వీరందరూ పీఎం మోదీతో కలిసి లంచ్ చేయనున్నారు.  రామ్ లీలా మైదానంలో మధ్యాహ్నం 12 గంటలకు  జరగనున్న ఈ ప్రమాణస్వీకారోత్సవ వేడుకకకు ప్రధాని మోదీతో పాటుగా పలువురు కేంద్రమంత్రలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రలు, 50 మంది సెలబ్రేటీలు, వ్యాపారవేత్తలు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

Also Read :  వల్లభనేని వంశీకి మరో ఎదురు దెబ్బ.. హైకోర్టు బిగ్ షాక్!

Also Read : భూపాలపల్లి హత్య ఘటనపై సీఎం రేవంత్ సీరియస్.. సంచలన నిర్ణయం!

Advertisment
తాజా కథనాలు