/rtv/media/media_files/2025/02/01/6FVbE3zfufTLxPZsUCOb.jpg)
Samantha Ruth Prabhu
Samantha: ఈ మధ్య సినిమాల్లో కనిపించకపోయినా.. తరచూ సోషల్ మీడియాలో తనకు సంబంధించిన విషయాలను, ఫొటోలను షేర్ షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తుంటారు నటి సమంత. అయితే తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో సామ్ షేర్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఒంటరిగా ఉండడం చాలా భయంకరమైనదని తెలిపారు. "మూడు రోజులు ఫోన్ లేకుండా, ఎవరితో కమ్యూనికేషన్ లేకుండా మౌనంగా ఉన్నాను. మనతో మనం ఒంటరిగా ఉండడం చాలా కష్టమైన విషయాల్లో ఒకటి.. అలాగే భయంకరమైనది. కానీ, ఇలా ఉండడానికి నేను ఇష్టపడవుతున్నాను. మీరు కూడా ఇలా ఉండడానికి ట్రై చేయండి" అంటూ పోస్ట్ పెట్టింది.
Also Read: Kiccha Sudeep: హైదరాబాద్ మెట్రోలో హీరో కిచ్చా సుదీప్.. అక్కడ ఏం చేశారో చూడండి?
రెండు సినిమాలు
మాయోసైటీస్ నుంచి మెల్లి మెల్లిగా కోలుకుంటున్న సామ్ ప్రస్తుతం తన ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. డైట్, వ్యాయామాలు, యోగా, ఆధ్యాత్మిక అంశాలతో సమయం గడుపుతున్నారు. మళ్ళీ బ్యాక్ టూ ఫార్మ్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే సమయం దొరికినప్పుడల్లా సినిమా షూటింగ్స్, రెగ్యులర్ ఈవెంట్స్ లో పాల్గొంటున్నారు. ఇటీవలే సిటాడెల్ సీరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సీరీస్ విపరీతమైన ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. ఉత్తమ వెబ్‌సిరీస్‌గా అవార్డు కూడా గెలుచుకుంది.
Also Read: అమెరికా నుంచి అక్రమ వలసదారులు ఔట్.. అమృత్‌సర్‌లో ల్యాండ్ అయిన విమానం
నెక్స్ట్ తన సొంత ప్రొడక్షన్ 'ట్రాలాలా' బ్యానర్ పై 'మా ఇంటి బంగారం' సినిమా చేస్తున్నారు. మరోవైపు 'రక్త్‌బ్రహ్మాండ్' అనే వెబ్ సీరీస్ కూడా చేస్తోంది. ‘తుంబాడ్’ ఫేమ్ రాహి అనిల్ బార్వే ఈ సీరీస్ ను తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ లో కూడా జాయిన్ అయ్యారు
Also Read: AR Rahman: నోరు తెరిస్తే ఏమౌతుందో తెలిసిందా.. యూట్యూబర్ అల్లాబాడియాకు రెహ్మాన్ చురకలు!
Also Read: Boney Kapoor: ఇంట్లో అలా చేస్తే తప్పేంకాదు.. అలహాబాదియా వివాదంపై శ్రీదేవి భర్త షాకింగ్ కామెంట్స్!