/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Bhatti-Vikramarka-2-1.jpg)
తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళను కట్టించి ఇస్తామని చెప్పింది. కానీ ఇంతలో ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. దీంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఆ కారణంగా తెలంగాణలో అమలు అవుతున్న పథకాలను నిలిపివేయాలని ఈసీ చెప్పింది. దీంతో అన్ని పథకాలు ఆగిపోయాయి. అయితే తాజాగా దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలతో పాటూ అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ సమీక్ష నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభించమని రెవెన్యూ, ఐఅండ్‌పీఆర్ అధికారుల సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు ఇచ్చారు. మహబూబ్ నగర్ నుంచి నిర్మాణం ప్రారంభించాలని చెప్పారు.
Also Read: USA: ముంబై పేలుళ్ళ నిందితుడు తహవూర్ రాణా అప్పగింతలో ట్విస్ట్...మరింత ఆలస్యం
అలాగే ప్రభుత్వ భూముల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డిప్యూటీ సీఎం అధికారులను కోరారు. ప్రభుత్వ పథకాలను షార్ట్ ఫిల్మ్ ద్వారా ప్రచారం చేయాలని తెలిపారు. వీటన్నిటితో పాటూ శాటిలైట్ టౌన్ షిప్ నిర్మాణాలపై హౌజింగ్ శాఖ దృష్టి సారించాలని భట్టి చెప్పారు. డిజిటల్ భూ సర్వేకు అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని.. ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు.
Also Read: Cricket: టీమ్ ఇండియా తరువాతి కెప్టెన్ బుమ్రా...రోహిత్ ను ఒప్పించిన బీసీసీఐ