TGPSC New Chairmen : TGSPCకి కొత్త ఛైర్మన్!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. TGPSC నూతన ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశంను నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఛైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పదవి కాలం డిసెంబర్ 3తో ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

New Update
TGPSC: టీజీపీఎస్‌సీ కీలక నిర్ణయం!

TGPSC Chairman: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. TGPSC నూతన ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశంను నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఛైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పదవి కాలం డిసెంబర్ 3తో ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 2న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ బాధ్యతలను బుర్రా వెంకటేశం స్వీకరించనున్నారు.  2030 వరకు ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఉన్న పదవికి VRS కోసం దరఖాస్తు చేసుకున్నారు బుర్రా వెంకటేశం. తనపై నమ్మకం పెట్టుకొని.. తనను నియమించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు వెంకటేశం. 

ఇది కూడా చదవండి: రానున్న మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు!

లీకుల వ్యవహారంతో రగడ...

ఇది కూడా చదవండి: భూసేకరణ కోసం కొత్త నోటిఫికేషన్!

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో గ్రూప్-1 పరీక్షా పేపర్ల లీకేజి వ్యవహారం కలకలం రేపింది. ఈ లీకులు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఓటమి చెందడానికి ఒక కారణం కూడా అయ్యాయి.  TSPSC నిర్వహించిన గ్రూప్‌–1 సహా పలు ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలు, గ్రూప్ - 2 వాయిదాలు వంటి నిర్ణయాలతో నిరుద్యోగుల్లో అసంతృప్తి నెలకొంది. ఈ క్రమంలో ఈ ఘటనలపై కేసులు కూడా నమోదు కావడం TSPSC కు ఉన్న పేరు మూసీ నదిలో కలిసింది. 

ఆనాడు TSPSC కి ఛైర్మన్ గా ఉన్న  జనార్థన్ రెడ్డి రాజీనామా చేయాలనే డిమాండ్లు కూడా వచ్చాయి. అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది అధికారంలోకి రావడంతో TSPSCని ప్రక్షాళన చేస్తున్నట్లు ప్రకటించింది. TSPSC ని TGPSC గా మార్చింది. కాగా TSPSC ఛైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో నలుగురు రాజీనామా చేశారు. వారి రాజీనామాను అప్పటి గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపింది. ఆ తరువాత తెలంగాణ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని TGSPC ఛైర్మన్ గా చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
 

ఇది కూడా చదవండి: ప్లీజ్ నాన్న మమ్మల్ని చంపొద్దు.. కాళ్లు పట్టుకున్నా కనికరించని తండ్రి

ఇది కూడా చదవండి: రైతులకు గుడ్‌న్యూస్‌.. ఈరోజు 3 లక్షల మందికి రుణమాఫీ !

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు