AP: ఏపీ విద్యార్థులకు శుభవార్త..ఒక్కొక్కరికి రూ.15వేలు..! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి రూ.5,837 కోట్లు బడ్జెట్‌లో కేటాయించింది. బడికి వెళ్తున్న ప్రతి విద్యార్థికీ ఏటా రూ.15 వేలు చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు సమాచారం. By Bhavana 12 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Ap News: ఏపీ ప్రభుత్వం బడ్జెట్‌లో పథకాలకు నిధులు కేటాయించింది. ఈ మేరకు విద్యాశాఖకు సంబంధించి పథకాలకు నిధులు విడుదల చేశారు. సూపర్ సిక్స్‌లో భాగంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో కీలకమైనది, ముఖ్యమైనది తల్లికి వందనం. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 15 వేల చొప్పున అందిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. Also Read: Ap Assembly: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఆయనే..! ఏడాదికి రూ. 15 వేల చొప్పున... ఆ హామీ అమలు దిశగా.. ప్రస్తుత ఏడాది నుంచే ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు సమాచారం. దీని కోసం 2024-25 బడ్జెట్‌లో రూ. 6,487 కోట్ల నిధులను కేటాయించారు. కాకపోతే ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు.. ఏడాదికి రూ. 15 వేల చొప్పున తల్లికి వందన పేరుతో అందించనున్నట్లు సమాచారం. ఈ సాయాన్ని విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్‌లలో జమ చేయనున్నారు. Also Read: BC Janardhan Reddy: కుటుంబాన్ని కలవనివ్వకుండా..32 రోజులు నిర్బంధించారు గత ప్రభుత్వంలో అమ్మఒడి పేరుతో ఈ పథకాన్ని అమలు చేసింది.. ఆ సమయంలో కుటుంబంలో ఒక్కరికి మాత్రమే సాయం అందించారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటూంటే అంతమందికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు నిధుల కేటాయించింది. Also Read: Varra Ravindra Reddy: వర్రా రవీందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్! తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులను కూటమి ప్రభుత్వం బీసీ, ఈడబ్ల్యూఎస్, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల వారీగా రూ. 4,213.52 కోట్లు కేటాయించింది. గత ప్రభుత్వం పాఠశాల విద్యకు పెట్టిన ఖర్చు కంటే రూ. 1,526 కోట్లు ఎక్కువ ఖర్చు చేయనున్నట్లు సమాచారం. అంతేకాదు రాష్ట్రంలో ఉన్నత విద్యకు సంబంధించి 2023-24 ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాల వ్యయం కంటే రూ. 93 కోట్లు అధికంగా నిధులు కేటాయించనున్నట్లు సమాచారం. Also Read: Ayodhya: అయోధ్య పునాదులు పెకిలిస్తాం.. ఖలిస్తానీ ఉగ్రవాది బెదిరింపులు యువతకు నైపుణ్య శిక్షణ, సాంకేతిక విద్యకు సంబంధించి రూ. 1,215.67 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ఈ బడ్జెట్‌లో ఆర్జీయూకేటీకి రూ.94.73 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. అన్ని వర్సిటీలు, సీపీ బ్రౌన్ గ్రంథాలయానికి కలిపి 2024-25కు సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం రూ.1,235.17 కోట్ల మేర ఖర్చు పెట్టనుంది. #ap budget session #talliki vandanam scheme #talliki vandanam scheme budget మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి