Pushpa 2: పూనకాలు తెప్పించే 'పుష్ప-2' అప్డేట్.. ఇక రచ్చ రచ్చే పుష్ప 2 మూవీ ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ అయింది. నవంబర్ 17న సాయంత్రం 6.03 గంటలకు పాట్నలో ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. By Seetha Ram 12 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'పుష్ప-2'. లెక్కల మాస్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బన్నీ యాక్టింగ్, స్వాగ్, డైలాగ్స్, యాక్షన్, సాంగ్స్ ఇలా ప్రతి ఒక్కటి సినిమా రేంజ్ ను మార్చేశాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఈ సినిమా సూపర్ డూపర్ టాక్ తో దూసుకుపోయింది. Also Read: AP: ఏపీ విద్యార్థులకు శుభవార్త..ఒక్కొక్కరికి రూ.15వేలు..! దీంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ ను మరింత గ్రాండ్ లెవెల్లో తెరకెక్కించాలని దర్శకుడు సుకుమార్ నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే కాస్త లేటు అయినా కంటెంట్ పెర్ఫెక్ట్ గా ఉండాలిని మెల్ల మెల్లగా తీస్తున్నాడు. ఇక ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. Also Read: Ap Assembly: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఆయనే..! ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. కానీ దానిని వాయిదా వేశారు. ఈ సారి డిసెంబర్ 6న రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈసారి చెప్పిన తేదీ కంటే ఒక రోజు ముందుగానే రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంటే డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇక అప్పటి నుంచి వరుస అప్డేట్ లు వదులుతూ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని పెంచారు. ఇటీవలే ఈ మూవీ నుంచి ఓ సర్ ప్రైజ్ అందించారు. ఇందులో ఐటెం సాంగ్ కోసం శ్రీలీలను సెలెక్ట్ చేసినట్లు తెలిపారు. Also Read: BC Janardhan Reddy: కుటుంబాన్ని కలవనివ్వకుండా..32 రోజులు నిర్బంధించారు ట్రైలర్ వచ్చేస్తోంది ఇక మూవీ రిలీజ్ కు సమయం దగ్గర పడుతుండటంతో ఇప్పుడు మరో ట్రీట్ ఇచ్చారు. ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు. నవంబర్ 17న సాయంత్రం 6.03 గంటలకు పట్నలో ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. Dropping an EXPLOSIVE BANGER before the MASS festival begins in Cinemas ❤🔥Experience the MASSIVE #Pushpa2TheRuleTrailer on 17th November at 6:03 PM 🌋🌋With a Blasting Event at PATNA 💥💥#Pushpa2TheRule#Pushpa2TheRuleOnDec5thIcon Star @alluarjun @iamRashmika… pic.twitter.com/nCFKC4kYA5 — Pushpa (@PushpaMovie) November 11, 2024 Also Read: Varra Ravindra Reddy: వర్రా రవీందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్! #tollywood #pushpa 2 updates #allu-arjun #pushpa 2 movie మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి