TG: ఎల్లుండి నుంచి అసలు సర్వే.. ఏ ఇళ్లు వదలొద్దు: సీఎస్ కీలక ఆదేశాలు

తెలంగాణలో నవంబర్ 9నుంచి అసలు కుటుంబ సమగ్ర సర్వే మొదలవుతుందని సీఎస్ శాంతి కుమారి తెలిపారు. ఈ సర్వేను విజయవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు చిత్త శుద్దితో కృషిచేయాలన్నారు. ఏ ఇంటినికూడా వదలకుండా పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. 

s ee
New Update

TG News: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతంగా పూర్తి చేసేందుకు చిత్త శుద్దితో కృషిచేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణపై నేడు ప్రత్యేకాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

Also Read: నేను గెలిస్తే బ్రహ్మచారులందరికీ పెళ్లి చేస్తా..!

ఈ నెల 9 నుండి అసలు సర్వే..

ఈ మేరకు ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా కూడా పాల్గొన్న ఈ టెలీ కాన్ఫరెన్స్ లో సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, ఈ సర్వే కు సంబంధించి ఇంటింటి వివరాలను సేకరించి స్టిక్కరింగ్ చేసే ప్రక్రియ రేపటితో పూర్తవుతుందని, ఈ నెల 9 నుండి అసలు సర్వే మొదలవుతుందని అన్నారు. ఉమ్మడి జిల్లాలకు నియమితులైన ప్రత్యేకాధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి సర్వే జరుగుతున్న విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించడంతో పాటు, జిల్లా కలెక్టర్లు, సర్వే నోడల్ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. సేకరించిన వివరాలను కంప్యూటరైజ్ చేయడానికి సుశిక్షితులైన డాటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించేల చర్యలు చేపట్టాలని సూచించారు.

ఇది కూడా చదవండి: WPL: మహిళ ప్రీమియర్ లీగ్ 2025.. రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా ఇదే!

 
దేశంలోనే ప్రధమంగా చేపట్టిన ఈ  ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియని రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. ఈ సర్వేలో ప్రతీ ఒక్క కుటుంబం పాల్గొనేలా ప్రతీ రోజూ ప్రజలను ఛైతన్య పర్చేలా విస్తృత ప్రచారం చేపట్టాలని తెలిపారు. ఏ ఇంటినికూడా వదలకుండా పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. 

ఇది కూడా చదవండి: Ponguleti: అప్పుడే ఆటమ్‌ బాంబ్‌ పేలబోతోంది.. పొంగులేటి మరో సంచలనం!

#telangana #cs-santhi-kumari #house-survey
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe