Maharashtra : నేను గెలిస్తే బ్రహ్మచారులందరికీ పెళ్లి చేస్తా..!

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఎన్సీ పీ వర్గానికి చెందిన రాజేసాహెబ్ దేశ్‌ముఖ్ అనే నేత ఇచ్చిన హామీ ఒకటి వైరల్‌ అవుతుంది. తాను గెలిస్తే పార్లిలోని బ్రహ్మచారులందరికీ పెళ్లిళ్లు జరిపించే బాధ్యతను తీసుకుంటానని హామీ ఇవ్వడమే ఇందుకు కారణం.

New Update
marriege

మహారాష్ట్ర

ఎన్నికల పోటీలో నిలిచిన అభ్యర్థులు ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు రకరకాల హామీలు ఇవ్వడం అనేది సర్వసాధారణ విషయం. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) నేత రాజేసాహెబ్ దేశ్‌ముఖ్ ఇచ్చిన హామీ ఒకటి తాజాగా వైరల్‌ గా మారింది.  బీడ్ జిల్లాలోని పార్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆయన.. ఈ ఎన్నికల్లో తాను గెలిస్తే పార్లిలోని బ్రహ్మచారులందరికీ పెళ్లిళ్లు జరిపించే బాధ్యతను తీసుకుంటానని హామీ ఇచ్చారు.

Also Read:  Pawan Kalyan: వాలంటీర్లకు బిగ్‌ షాక్‌...డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు!

మంగళవారం సాయంత్రం పార్లిలో నిర్వహించిన ర్యాలీలో రాజేసాహెబ్ ప్రసగింస్తూ.. పార్లీ అబ్బాయిలకు జాబ్స్‌ ఉన్నాయా? లేక ఏదైనా వ్యాపారం చేస్తున్నారా? అని పెళ్లికి ముందు పెద్దలు ఎంక్వైరీలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఇవ్వకుంటే ఉద్యోగాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. గార్డియన్ మంత్రి ధనంజయ్ ముండే పరిశ్రమలు స్థాపన, ఉద్యోగ కల్పనను పట్టించుకోకుంటే  బ్యాచిలర్లు ఏం చేస్తారని అడిగారు. తాను గెలిస్తే వారందరికీ పెళ్లిళ్లు జరిపించి, బతికేందుకు ఓ దారి చూపిస్తానని మాట ఇచ్చారు.

Also Read:  Australia: 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం!

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజేసాహెబ్ హామీపై ఎన్సీపీ (ఎస్‌సీపీ) అధికార ప్రతినిధి అంకుష్ కాక్డే మాట్లాడుతూ.. మరాఠ్వాడాలో యువకులకు పెళ్లిళ్లు కావడం లేదని, గత దశాబ్దకాలంగా ఇక్కడ ఉద్యోగం అన్న మాటే లేదని పేర్కొన్నారు. 

Also Read:  Jet Airways కథ ముగిసినట్లే..సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!

మరాఠ్వాడాను అభివృద్ధి చేశామని బీజేపీ, దాని మిత్రపక్షాలు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అలాంటిదేమీ లేదని విమర్శించారు. ఇక్కడ యువతకు ఉద్యోగాలు లేకపోవడం సామాజిక సమస్యగా మారిందని పేర్కొన్నారు. కాబట్టి యువతకు పెళ్లిళ్లు జరిపిస్తామని ఎవరైనా హామీ ఇస్తే అందులో తప్పేమీ లేదన్నారు.

Also Read: Anil Ambani: అనిల్‌ అంబానీకి షాక్...మూడేళ్ల పాటు ఆ కంపెనీ బంద్‌!

Advertisment
తాజా కథనాలు