సరస్వతి పుష్కరాల్లో ప్రజా ప్రతినిధులకు ఎవరికీ అవమానం జరగలేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరిని నిందించాల్సిన అవసరం లేదన్నారు. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్, హరీష్ రావు,ఈటల రాజేందర్ కు నోటీసులు ఇవ్వడంపై స్పందించారు. కమిషన్ కు నాటి సీఎం తో పాటు ఇరిగేషన్, ఆర్థిక మంత్రి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక కోణంలో నిర్ణయం తీసుకుంటుందన్నారు. అందుకే కమిషన్ వేసినట్లు చెప్పారు. ఈటల రాజేందర్ ను కేసీఆర్ కావాలనే బీజేపీలోకి పంపించారా? అని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. తప్పు ఎవరు చేసినా జైలుకు వెళ్లాల్సిందేనన్నారు.
ఇది కూడా చదవండి: BIG BREAKING: కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు.. హరీష్, ఈటలకు కూడా!
ఈ ముగ్గురు జైలుకే..
తెలంగాణను దొంగలకు దొడ్డిగా మార్చారని బీఆర్ఎస్, బీజేపీపై ధ్వజమెత్తారు అద్దంకి. 3 ఏళ్లలో ఒక్క పిల్లర్ పోతే ఏం అవుతుంది? అని కేసీఆర్ అంటున్నాడన్నారు. మరి నాగార్జున సాగర్, శ్రీశైలంలో ఎందుకు ఒక్క పిల్లర్ కూడా కూలలేదో చెప్పాలని ప్రశ్నించారు. గతంలో గవర్నర్ కాళేశ్వరరావు అన్నారన్నారు. ఇప్పుడు కూలగానే నోవేశ్వర్ రావు అంటున్నాడని ఎద్దేవా చేశారు. ప్రాజెక్ట్ కోసం భూదందా చేసేవారిలా ఇష్టం వచ్చినట్లు భూములు లాక్కున్నారన్నారు. వీళ్లు ముగ్గురికి జైలుకి వెళ్లడానికి అన్ని అర్హతలు ఉన్నాయన్నారు.
ఇది కూడా చదవండి: Telangana Raj Bhavan: రాజభవన్ లో దొంగతనం చేసింది అతనే.. పోలీసుల సంచలన ప్రకటన!
కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని ఎవరి మీద బట్ట కాల్చి వేయదన్నారు. రాజ్యాంగ బద్దంగా వ్యవహరించి విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని స్పష్టం చేశారు. కేసీఆర్ నిజాయితీ నిరూపించుకుంటే పూలదండలు వేస్తామన్నారు. బీజేపీని ప్రశ్నిస్తే దేశ ద్రోహులా? అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి లాంటి బానిసలు ఉండబట్టే ఈ ప్రాంతానికి తీవ్ర నష్టం జరుగుతోందని ధ్వజమెత్తారు. బీజేపీ అంటేనే బూతు జనతా పార్టీ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు చైనా పైన ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పాకిస్తాన్ వదిలిన ప్రతీ బాంబు చైనా తయారు చేసిందేనన్నారు.
(Aaddanki dayakar | telugu-news | telugu breaking news | kaleshwaram case)
BJP అంటే బూతు జనతా పార్టీ.. కేసీఆర్‌కు పూల దండలు వేస్తాం: ఎమ్మెల్సీ అద్దంకి సంచలన వ్యాఖ్యలు!
BJP అంటేనే బూతు జనతా పార్టీ అని.. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. BJPని ప్రశ్నిస్తే దేశ ద్రోహులా? అని ధ్వజమెత్తారు. తప్పు ఎవరు చేసినా జైలుకు వెళ్లాల్సిందేనన్నారు. కాళేశ్వరం వ్యవహారంలో KCR నిజాయితీ నిరూపించుకుంటే పూలదండలు వేస్తామన్నారు.