Cm Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్.. అధిష్టానంతో కీలక భేటీ!

TG: సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు అక్కడ జరిగే CWC సమావేశానికి హాజరు కానున్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం వెంట భట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనర్సింహ వెళ్లనున్నారు.

New Update
CM REVANTH RAHUL

CM Revanth Reddy: ఇవాళ మధ్యాహ్నం 2.30గం.లకు కాంగ్రెస్‌ CWC భేటీ జరగనుంది. ఈవీఎంలపై దేశవ్యాప్త ఆందోళనకు కార్యచరణ చేపట్టనుంది. ఇటీవల నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈవీఎంలపై కాంగ్రెస్‌ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. పలు రాష్ట్రాల్లో సంస్థాగత సమస్యలపై సమీక్షించే ఛాన్స్ ఉంది. ఢిల్లీ, బీహార్‌ ఎన్నికల వ్యూహంపైనా CWC చర్చించనుంది. భేటీకి హాజరు కావాలని కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం అందింది. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి హాజరు కానున్నారు.

ఇది కూడా చదవండి: సీఎం రేవంత్‌పై పరువు నష్టం కేసు.. విచారణ వాయిదా

సీఎం రేవంత్ పై ఒత్తిడి..?

కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందుకు ప్రధాన కారణం ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను ఆయుధంగా పెట్టుకొని ఎన్నికల ప్రచారం చేసింది కాంగ్రెస్. అయితే నాలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో ఇండియా కూటమి అధికారంలోకి రాగా.. మరో రెండు రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై కసరత్తు చేసి వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఈరోజు జరిగే సమావేశంలో సీఎం రేవంత్ కు అధిష్టాన పెద్దలు కీలక సూచనలు ఇచ్చే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: ఈ నెల 30న అకౌంట్లోకి డబ్బు జమ!

గ్రామాల్లో మూడు రంగుల జెండా.. !

ఇది కూడా చదవండి: BREAKING: వైసీపీ మాజీ మంత్రి పీఏ అరెస్ట్!

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో గ్రామాల్లో పార్టీ బలోపేతంపై నేతలతో సమావేశాలు నిర్వహించాలని టీ కాంగ్రెస్ నేతలు బావిస్తున్నట్లు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వేళ్ళని సీఎం రేవంత్ సహా ఇతర కాంగ్రెస్ పెద్దలు ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్, జనవరి నాటికి ఇచ్చిన ఆర్టు గ్యారెంటీలను అమలు చేసేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఫిబ్రవరి నెలలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇది కూడా చదవండి: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు