TG News: ఢిల్లీని చూసి గుణపాఠం నేర్చుకోవాలి.. సీఎం రేవంత్ సంచలన కామెంట్స్!

ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. కాలుష్యంలో ఢిల్లీని చూసి మనం గుణపాఠం నేర్చుకోవాలన్నారు. అందుకే మూసీ ప్రక్షాళన చేయాలని చెబుతున్నానంటూ జపాన్ తెలుగు సమాఖ్య నిర్వహించిన కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. 

New Update
cm rvnt

Telangana CM Revanth sensational comments on Musi River

TG News: ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. కాలుష్యం గురించి ఢిల్లీని చూసి మనం గుణపాఠం నేర్చకోవాలన్నారు. అందుకే మూసీ ప్రక్షాళన చేయాలని చెబుతున్నాననంటూ జపాన్ తెలుగు సమాఖ్య నిర్వహించిన కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. 

cm revanth reddy
cm revanth reddy

 

మన సంస్కృతి, అభివృద్ధికి ప్రతీక..

ఈ మేరకు తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగంలో సాధించాల్సినంత ప్రగతి సాధించామని ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేసుకోబోతున్నామని, ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను అభివృద్ధి చేసుకుందామన్నారు. టోక్యోలో అభివృద్ధి చేసిన రివర్ ఫ్రంట్ పరిశీలించామని చెప్పిన సీఎం.. మన సంస్కృతికి, అభివృద్ధికి ప్రతీక మూసీ నది. అలాంటి నది ప్రక్షాళనకు కొంతమంది అడ్డుపడుతున్నారని అన్నారు. ఢిల్లీలో కాలుష్యంతో అన్ని సంస్థలకు సెలవులు ఇస్తున్న పరిస్థితి ఉందని, కేవలం కాలుష్యంతో ఢిల్లీ నగరం స్థంభించే పరిస్థితి ఉంటే మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. 

TG News
TG News

 

Also Read: 'ది రాజా సాబ్' ఉన్నట్టా లేనట్టా..? త్వరగా తేల్చండ్రా బాబూ..!

అందుకే హైదరాబాద్ లో మూసీ ప్రక్షాళన చేయాలని నేను చెబుతున్నా. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్స్ తెలంగాణ పురోగతికి అత్యంత కీలకమైన అంశాలు. తెలంగాణలో పెట్టుబడులు పెరగాలి, పరిశ్రమలు పెరగాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలనేదే ప్రభుత్వ ఉద్దేశం. ఈ తెలంగాణ అభివృద్ధిలో మీ అందరి సహకారం అవసరం ఎవరికి చేతనైనంత వారు చేయగలిగింది చేస్తే.. ప్రపంచంతోనే మనం పోటీ పడొచ్చు. మీ ఆలోచనలను రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోండి. సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఉన్న ఆనందం ఏమిటో మీకు తెలుసంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

Telangana
Telangana

 

Also Read: చిరు ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్.. 8kలో 'స్టాలిన్' గ్రాండ్ రీ-రిలీజ్‌..!

musi | river | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు