/rtv/media/media_files/2025/04/18/kObdfyDWHz3mB4MmIYLw.jpg)
Raja Saab Update
Raja Saab Update: ప్రభాస్(Prabhas) అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ది రాజా సాబ్ నుంచి ఎటువంటి అప్డేట్ రాకపోవడంతో అభిమానులలో నిరాశలో ఉన్నారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు టీజర్ సిద్ధంగా ఉందన్న వార్త ఫ్యాన్స్ కి కొంత ఉత్సాహాన్ని ఇచ్చినప్పటికీ, అది మాత్రమే సరిపోదని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు రిలీజ్ డేట్‌పై స్పష్టత ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.
Also Read: చిరు ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్.. 8kలో 'స్టాలిన్' గ్రాండ్ రీ-రిలీజ్..!
పెండింగ్‌లో ఉన్న టాకీ పార్ట్
ప్రస్తుతం ప్రభాస్ విదేశాల్లో ఉన్న నేపథ్యంలో, ఆయన తిరిగి వచ్చిన వెంటనే టీజర్‌కు డబ్బింగ్ పూర్తి చేసి, తరువాతి ప్రమోషనల్ స్టెప్స్ తీసుకోనున్నట్టు సమాచారం. అయితే, ఈ ప్రాజెక్ట్‌కు రిలీజ్ డేట్ చెప్పడం అంత సులువు కాదని ఇండస్ట్రీలో చర్చ సాగుతోంది. అందుకు కారణం మిగిలిన పాటల చిత్రీకరణ ఇంకా పూర్తి కాకపోవడం. అలాగే పెండింగ్‌లో ఉన్న టాకీ పార్ట్‌కి ప్రభాస్ డేట్స్ సెట్ చేయడం దర్శకుడు మారుతీకి పెద్ద సవాలుగా మారింది.
Also Read: మరో బడా ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మిల్కీ బ్యూటీ.
ఇక మరోవైపు, ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ చిత్రానికి సంబంధించిన పనుల్లో ఉన్నారు. కానీ రాజా సాబ్ ప్రాజెక్ట్‌ను మాత్రం పట్టించుకోవడం లేదు. పలు మీడియా కథనాల్లో సినిమా గురించి వస్తున్న గాసిప్స్ అభిమానుల్లో భయం కలిగిస్తున్నాయి. టీజర్ విడుదలయితే అవి కొంతవరకు తగ్గే అవకాశమున్నా, పూర్తిగా క్లారిటీ వచ్చేంత వరకు ఫ్యాన్స్ కి ప్రశాంతత లేనట్టే.
Also Read: చక్రం క్లైమాక్స్ రిపీట్.. ప్రభాస్ ను చంపబోతున్న మరో డైరెక్టర్..?
వాస్తవానికి, దసరా రిలీజ్ అనుకున్నప్పటికీ దసరా సీజన్‌కి ఈ సినిమా రావడం అసాధ్యం. ఇప్పటికే ఆ సీజన్‌కి కాంతార 2, అఖండ 2, సంబరాల ఏటి గట్టు, ఇడ్లీ కడాయ్ వంటి సినిమాలు సిద్ధంగా ఉన్నందున, రాజా సాబ్ వేరే సీజన్ కోసం వెతకాల్సిన పరిస్థితి. దీపావళి టాలీవుడ్‌లో పెద్దగా వసూళ్లను ఇవ్వని సీజన్ కావడంతో, డిసెంబర్‌లో విడుదలపై టీమ్ ఫోకస్ పెట్టే అవకాశం ఉంది.
ఇక చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ కథానాయికలుగా నటిస్తుండగా, ప్రముఖ నటుడు సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ ఇప్పటికే కంపోజ్ చేసిన పాటలపై మరోసారి పని చేస్తున్నారు. మిగిలిన షూటింగ్ పార్ట్‌లో కొన్ని ముఖ్యమైన భాగాలు మాత్రమే పూర్తికావాల్సి ఉంది. మొత్తంగా చెప్పాలంటే, ది రాజా సాబ్ మూవీ అభిమానుల్లో ఎగ్జైట్‌మెంట్‌తో పాటు ఉత్కంఠను కలిగిస్తోంది. అధికారిక అప్డేట్ వచ్చిన తరువాతే సినిమాపై ఓ క్లారిటీ రానుంది.