Revanth Reddy: టార్గెట్ బీఆర్ఎస్.. రేవంత్ మాస్టర్ ప్లాన్ ఇదే!

స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో సత్తా చాటడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల నాటికి రైతు భరోసా, పింఛన్ల ద్వారా అందించే మొత్తాన్ని పెంచడంతో పాటు, మహాలక్ష్మి స్కీమ్ ను సైతం అమలు చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.

New Update
Revanth 5

తెలంగాణలో సంక్రాంతి తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్న లక్ష్యంతో రేవంత్ సర్కార్ ముందుకు వెళ్తోంది. అయితే.. ఈ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి బీఆర్ఎస్, బీజీపీని క్షేత్ర స్థాయిలో ఖతం చేయాలన్న వ్యూహంతో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సాధ్యమైనన్ని ఎక్కువ స్కీమ్స్ ను అమలు చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా రైతు భరోసా సాయం, పెన్షన్లను పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం. మరో వైపు మహిళలకు నెలకు రూ.2500 అందించే స్కీమ్ ను సైతం అమలు చేయాలని రేవంత్ సర్కార్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇందుకోసం నిధుల సమీకరణ, గైడ్ లైన్స్ రూపకల్పనపై అధికారులు ఫోకస్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పథకాల లబ్ధిదారుల ఓట్లలో స్థానిక సంస్థలపై కాంగ్రెస్ జెండా ఎగర వేయాలన్నది ప్రభుత్వ ప్లాన్ గా తెలుస్తోంది. 

Also Read: భారత్‌లో లంచాలు..యూఎస్‌లో కేసులు ఎలా?అదానీని కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

ఇదిలా ఉంటే.. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. జనవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ ప్లాన్​ రెడీ చేసింది. డిసెంబర్ చివరి వారంలోగా కులగణన సర్వే లెక్కలు పూర్తి చేసి సంక్రాతి తర్వాత ఎలక్షన్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 

Also Read: కేసీఆర్ ఫ్యాన్స్ కు ఇక పండగే.. ఆ సినిమాలో గులాబీ బాస్ స్పెషల్ రోల్!

సంక్రాంతి తర్వాతే ఎన్నికలు.. 

ఈ మేరకు రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టులో వచ్చె నెలలో హియరింగ్​ ఉంది. దీంతో డిసెంబర్​ రెండో వారం కల్లా ఈ ప్రక్రియ పూర్తి చేసి జనవరిలో ఎన్నికలు కంప్లీట్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తుంది.​ కులగణన సర్వే వివరాలు రాగానే వాటిని డెడికేటెడ్ కమిషన్ కు అందించనుంది. అందులోని వివరాలు, కమిషన్​ చేసిన అధ్యయన నివేదిక రెండింటి ఆధారంగా రిజర్వేషన్లను ఎంతమేరకు పెంచాలనే దానిపై ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది. ఇందులో భాగంగానే రిజర్వేషన్లను ఖరారు చేసి.. ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ అంతా డిసెంబర్​ చివరిలోగా పూర్తి కానున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

Also Read: ఆర్జే వెంచర్స్‌ రూ.150 కోట్ల బిగ్ స్కామ్.. 600 మందిని మోసం చేసిన కంపెనీ

Also Read :  దారుణం.. ఒకేచోట 145 కోతులు మృతి

Advertisment
Advertisment
తాజా కథనాలు