Monkeys: దారుణం.. ఒకేచోట 145 కోతులు మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) గోదాంలో 145 కోతులు ప్రాణాలు కోల్పోయాయి. అయితే ఈ విషయాన్ని బయటపడనీయకుండా సిబ్బంది వాటిని అక్కడే పూడ్చిపెట్టారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
monkkk

ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. హాథ్రస్‌లో 145 కోతులు మృతి చెందడం కలకలం రేపుతోంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) గోదాంలో 145 కోతులు ప్రాణాలు కోల్పోయాయి. అయితే ఈ విషయాన్ని బయటపడనీయకుండా సిబ్బంది వాటిని అక్కడే పూడ్చిపెట్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. స్థానిక నేత హర్షిత్ గౌర్‌ ఈ విషయంపై పోలీసులు ఫిర్యాదు చేశారు. 

Also Read: భారత్‌లో లంచాలు..యూఎస్‌లో కేసులు ఎలా?అదానీని కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

తనకు తెలిసిన ఓ వ్యక్తి ఎఫ్‌సీఐ గోదాంలో పనిచేస్తున్నారని.. కోతులను పాతిపెట్టిన విషయం ఆ ఉద్యోగి వల్లే తెలిసిందని తెలిపారు. నవంబర్ 9న ఆహారధాన్యాలకు చీడపీడలు రాకుండే ఉండేందుకు రసాయనాలను పిచికారీ చేశారనన్నారు. ఆ తర్వాత గోదాంలోకి వచ్చిన కోతులు చనిపోయినట్లు ఆ ఉద్యోగి ద్వారా తెలిసిందని చెప్పారు. ఈ ఘటనపై ఉద్యోగులు ఇలా జరిగిన విషయాన్ని బయటకు చెప్పలేదని ఫిర్యాదులో తెలిపారు.  

Also Read: జగన్ కు చంద్రబాబు సర్కార్ బిగ్ షాక్.. అదానీ వ్యవహారంపై విచారణ?

FCI - Uttar Pradesh

మరోవైపు కొత్వాలి స్టేషన్ హౌస్ అధికారి విజయ్ సింగ్ కూడా ఈ ఘటనపై స్పందించారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణ చేస్తున్నామని తెలిపారు. జీవహింస వ్యతిరేక చట్టంలోని నిబంధనల ప్రకారం వాళ్లపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. ఇంత పెద్దస్థాయిలో కోతులు మృతి చెందడానికి గల కారణాలు తెలుసుకునేందుకు వెటర్నరీ వైద్యులను కూడా రప్పించామని స్పష్టం చేశారు. 

Also Read: ఆర్జే వెంచర్స్‌ రూ.150 కోట్ల బిగ్ స్కామ్.. 600 మందిని మోసం చేసిన కంపెనీ

అయితే 140 కోతులు మృతి చెందడంపై జంతు ప్రేమికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం బయటపడనివ్వకుండా వాటిని అక్కడే పూడ్చిపెట్టడంపై మండిపడుతున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపాలని.. ఇలాంటివి మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

Also Read: కేసీఆర్ ఫ్యాన్స్ కు ఇక పండగే.. ఆ సినిమాలో గులాబీ బాస్ స్పెషల్ రోల్!

Advertisment
Advertisment
తాజా కథనాలు