/rtv/media/media_files/2025/07/14/cm-revanth-mla-samel-2025-07-14-18-42-26.jpg)
నేడు తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో గత కొన్ని రోజులుగా బయటపడుతున్న వర్గ విభేదాలపై సీఎం పరోక్షంగా స్పందించారు. ఎమ్మెల్యేకు తనదైన శైలిలో చురకలు అంటించారు. తుంగతుర్తి కాంగ్రెస్ కార్యకర్తల గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. ఎమ్మెల్యే సామేలు కాంగ్రెస్ టికెట్ తీసుకుని రూ.50 వేలతో తుంగతుర్తికి వస్తే 60 వేల మెజార్టీతో గెలిపించారన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా చూసుకోవాలని ఎమ్మెల్యేకు సూచించారు. కష్టసుఖాలల్లో కలుపుకుపోవాలన్నారు. ఒకరికి బాధ, ఒకరికి దుఖం ఉంటుందని.. కార్యకర్తలను కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత నీపై ఉందని సామేలుకు క్లాస్ తీసుకున్నారు. ఎవరూ అధైర్య పడొద్దని కార్యకర్తలకు భరోసానిచ్చారు.
Also Read : ఈ 5 అలవాట్లతో హైబీపీ.. ముందుగా గుర్తించకపోతే ఆరోగ్యానికి ప్రమాదమే!
Also Read : భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. 10 లక్షలమందికి ఉపాధి
కార్యకర్తలను గెలిపించే బాధ్యత పార్టీది..
గత ఎన్నికల్లో మందుల సామేలును గెలిపించే బాధ్యత కార్యకర్తలు తీసుకున్నారని.. రానున్న స్థానిక ఎన్నికల్లో వారిని గెలిపించే బాధ్యత పార్టీ తీసుకుంటుందని భరోసానిచ్చారు. తొందరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయన్నారు. నల్గొండలో నికార్సైన కార్యకర్తలు ఉన్నారన్నారు. ఇక్కడ కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత పార్టీ తీసుకుంటుందన్నారు. ఇక్కడి నుంచి వచ్చే కార్యకర్తలకు ఎక్కువ సమయం ఇవ్వాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కోరారు. నల్గొండ కాంగ్రెస్ కార్యకర్తలకు ఆవేశం ఎక్కువ కానీ.. వివరించి చెబితే అన్నీ వింటారన్నారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే అన్ని సరిదిద్దుకుందామన్నారు. ఈ నియోజకవర్గంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఇవ్వొద్దన్నారు. తాము పదేళ్ల పాటు అధికారంలో ఉండడం ఖాయమని.. కార్యకర్తలందరికీ అవకాశాలు వస్తాయన్నారు.
Also Read : పాకిస్థాన్ లో 'రామాయణం' నాటకం.. ఫొటోలు చూస్తే ఫిదా!
గత కొన్ని రోజులుగా నియోజకవర్గంలో మాజీ మాంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేలు మధ్య వర్గ విభేదాలు తలెత్తుతున్నాయి. పాత కార్యకర్తలను పట్టించుకోకుండా.. ఎమ్మెల్యే సామేలు తన వెంట వచ్చిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని దామోదర్ రెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఈ రోజు కూడా సీఎం రేవంత్ కు స్వాగతం చెబుతూ దామోదర్ రెడ్డి వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు చింపేశారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేకు స్టేజీ మీదనే రేవంత్ క్లాస్ తీసుకున్నట్లు జిల్లా రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. ఇప్పటికైనా నియోజకవర్గంలో వర్గవిభేదాలు ఆగుతాయా? లేదా? అన్నది చూడాలని నేతలు చర్చించుకుంటున్నారు.
Also Read : అబ్బా అనిపిస్తున్న హెబ్బా నడుమందాలు.. జీన్స్‌లో నయా ట్రెండ్!
telugu-news | latest-telugu-news