Ramayanam: పాకిస్థాన్ లో 'రామాయణం' నాటకం.. ఫొటోలు చూస్తే ఫిదా!

పాకిస్థాన్ లోని కరాచీ నగరంలో ఒక నాటక బృందం 'రామాయణం' కథను రంగస్థలంపై ప్రదర్శిస్తూ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షించింది.  'మౌజ్' అనే థియేటర్ గ్రూప్ కరాచీ ఆర్ట్స్ కౌన్సిల్ వేదికపై ఈ నాటికను ప్రదర్శించారు.

New Update
ramayana drama at Karachi Pakistan

ramayana drama at Karachi Pakistan

Ramayanam: పాకిస్థాన్ లోని కరాచీ నగరంలో ఒక నాటక బృందం 'రామాయణం' కథను రంగస్థలంపై ప్రదర్శిస్తూ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షించింది.  'మౌజ్' అనే థియేటర్ గ్రూప్ కరాచీ ఆర్ట్స్ కౌన్సిల్ వేదికపై ఈ నాటికను ప్రదర్శించారు. ఈ ఇతిహాసాన్ని ప్రేక్షకులకు మరింత దగ్గర చేయడానికి సంభాషణలు, విజువల్స్ కోసం AI సాంకేతికతను ఉపయోగించారు. సాంకేతికతను వినూత్నంగా ఉపయోగించడం వల్ల ఈ పాత కథకు కొత్త కోణం చేరింది,  ఇది కేవలం ఒక దృశ్య విందే కాకుండా, సాంస్కృతిక సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది.

ఇది కూడా చూడండి:Vivo X200 FE: అబ్బా తమ్ముడూ.. Vivo నుంచి కిర్రాక్ స్మార్ట్‌‌ఫోన్.. కెమెరా సూపరెహే!

ఇది కూడా చూడండి:Axiom-4 mission: ISS నుంచి శుభాంశు శుక్లా తెస్తున్న 263కేజీల నిధి.. ఏంటో తెలిస్తే షాక్!

పాకిస్థాన్ లో 'రామాయణం'

'స్కూల్ ఆఫ్ విజువల్ & పెర్ఫార్మింగ్ ఆర్ట్స్'  అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీ ఈ నాటకానికి సంబంధించిన ఫోటోలను పంచుకుంది. ఇది చూసిన నెటిజన్లు  మతాలకు అతీతంగా కళ, సంస్కృతి ఎలా ప్రజలను ఒకచోట కలుపుతుందో ఈ నాటకం  నిరూపిస్తోందని కామెంట్లు పెడుతున్నారు. నాటక దర్శకుడు యోగేశ్వర్ కారేరా  ఈ ప్రదర్శనకు లభిస్తున్న ఆదరణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. విమర్శకులు, ప్రేక్షకులు దీనిని నాటక బృందం కృషిని ఎంతగానో ప్రశంసిస్తున్నారు.  ఈ నాటకం మత సామరస్యాన్ని పెంపొందించడంలో, ఇరు దేశాల ప్రజల మధ్య అవగాహనను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.

Famous Celebrity Divorces:సైనా నెహ్వాల్, ఏఆర్ రెహమాన్, జయం రవితో పాటు.. ఇటీవల విడాకులు తీసుకున్న ప్రముఖులు వీరే!

ఇది కూడా చూడండి:Radhika Yadav: పొట్టి బట్టలు వేసుకున్నందుకే హత్యా?.. రాధికా కేసులో ఫ్రెండ్ సంచలన విషయాలు

telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు