/rtv/media/media_files/2025/02/04/hQdcolJjKX0nijnZgQaz.jpg)
assembly tg Photograph: (assembly tg)
TG Politics: తెలంగాణ కులగణన సర్వేపై అసెంబ్లీలో సీఎం రేవంత్, ఎమ్‌ఐఎమ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మధ్య మాటల తూటాలు పేలాయి. కులగణన సర్వే నివేదికను అసెంబ్లీలో ఎందుకు చర్చకు పెట్టడం లేదని ముఖ్యమంత్రిని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. సమగ్ర కుటుంబ సర్వేను కూడా అసెంబ్లీలో పెట్టలేదని, కేవలం ప్రకటనల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదంటూ మండిపడ్డారు. దీంతో అ్బరుద్దీన్ వ్యాఖ్యలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. నివేదికను బయటపెట్టేందుకు మాకు అభ్యంతరం లేదని చెప్పారు. అయితే ప్రైవసీకి సంబంధించిన వివరాలున్నాయి కాబట్టే బయటపెట్టట్లేదని, దీన్ని బయటపెడితే లీగల్‌గా సమస్యలు వస్తాయని వివరించారు.
పబ్లిక్ చేతికి ఇవ్వలేము..
అక్భరుద్దిన్ ఒవైసీ అడిగిన నివేదిక మొత్తం నాలుగు వ్యాల్యూమ్‌ల రూపంలో ఉందని సీఎం తెలిపారు. ఇందులో 3 వాల్యూమ్ ప్రక్రియ విధానం, సర్వే చేపట్టిన వివరాలున్నాయి. 4వ వాల్యూమ్ లో మాత్రం ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత వివరాలున్నాయి. వాటిని ప్రజలకు ఇవ్వడానికి వీలులేదు. కేవలం ప్రభుత్వం, వ్యక్తికి మధ్య ఉన్న సమాచారం మాత్రమే. ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో సదరు సమాచారం ప్రజలు ఇచ్చారు. అలాంటి సమాచారాన్ని ప్రభుత్వం పబ్లిక్ చేతికి ఇవ్వలేదు అని సీఎం రేవంత్ చెప్పారు. వ్యక్తుల వ్యక్తిగత సమాచారం తప్పా మిగతా వివరాలు సభ్యులకు ఇస్తామని అన్నారు.
AI టెక్నాలజీతో సర్వే..
అయితే కులగణనను AI టెక్నాలజీతో జీహెచ్ఎంసీలో చేపట్టాలని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సూచించారు. నాంపల్లిలో చాలామందికి డబుల్ ఓటర్ కార్డులున్నాయని చెప్పారు. ఓటర్ కార్డులో ఒక అడ్రస్ ఉంటే ఆధార్ కార్డులో మరో అడ్రస్ ఉందన్నారు. 2011 తెలంగాణ సర్వే ప్రకారం 51లక్షల మంది మైనార్టీలు ఉన్నారు. ఆధార్ ప్రకారం తెలంగాణ జనాభా 3.80 కోట్లు అని వెల్లడించారు. నేను ఒక ముస్లింకే కాదు అన్ని వర్గాలకు ప్రతినిధిని అంటూ అక్బరుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: Elon Musk: చాట్ జీపీటీది లెఫ్ట్ భావాజాలం: ఎలాన్ మస్క్దేశంలో మొదటిసారి..
దేశంలోనే తొలిసారి తెలంగాణలో కులగణన చేసి చరిత్ర సృష్టించామని సీఎం చెప్పారు. పకడ్బందీగా సర్వేచేసి సమాచారం సేకరించామని, కులగణన, ఎస్సీ వర్గీకరణకు రోడ్ మ్యాప్ తెలంగాణ నుంచి ఇస్తున్నట్లు అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. కులగణన విషయంలో ప్రధానిపైనా ఒత్తిడి పెరుగుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుతో పాటు మంత్రివర్గ ఉప సంఘం, ఏకసభ్య కమిషన్ సిఫార్సుల ప్రకారం ముందుకెళ్తామని చెప్పారు. ప్రతిపక్ష నేత సభకు రావాలి కదా అని ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్షానికి బాధ్యత, చిత్తశుద్ధి లేదంటూ కేసీఆర్ ను విమర్శించారు.