ibomma : ఇమ్మడి రవి వద్ద 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల డేటా..సంచలన విషయాలు వెల్లడించిన సీపీ సజ్జనార్‌

పైరసీ వెబ్‌సైట్‌ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీపెద్దలు సజ్జనార్‌తో భేటీ అయ్యారు. మీడియాతో మాట్లాడారు. ఈ కేసు ఛేదించేందుకు జాతీయ సెక్యూరిటీ సంస్థల సహాయం తీసుకుంటామన్నారు.

New Update
FotoJet - 2025-11-17T121654.310

Imadi Ravi has data of 50 lakh subscribers..CP Sajjanar reveals shocking facts

ibomma : ibomma రవి కేసు ఛేదించేందుకు జాతీయ సెక్యూరిటీ సంస్థల సహాయం తీసుకుంటామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ చెప్పారు.ఇటీవల పైరసీ వెబ్‌సైట్‌ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీపెద్దలు సజ్జనార్‌తో భేటీ అయ్యారు. అనంతరం సజ్జనార్‌ మీడియాతో మాట్లాడారు.

FotoJet - 2025-11-17T122007.713

ఐ బొమ్మలో 21వేల సినిమాలున్నాయన్నారు. ప్రధాన నిందితుడు రవి నుంచి రూ.3 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.  ఇప్పటివరకు రవి రూ.20 కోట్లు సంపాదించినట్లు వెల్లడించారు. దీని వెనక పెద్ద రాకెట్ ఉందని, ఒక వెబ్ సైట్ బ్లాక్ చేస్తే వెంటనే మరో వెబ్ సైట్ ఓపెన్‌ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. హైదరాబాద్‌ నగర సీపీ సజ్జనార్‌తో సినీ పెద్దలు భేటీ అయ్యారు. అగ్ర కథానాయకులు చిరంజీవి, నాగార్జునలతో పాటు దర్శకుడు రాజమౌళి, నిర్మాత దిల్‌రాజు ఈ భేటీలో పాల్గొన్నారు. ఇటీవల పైరసీ వెబ్‌సైట్‌ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీపెద్దలు సజ్జనార్‌తో భేటీ అయ్యారు.

  పైరసీతో సినీ రంగానికి చాలా నష్టం జరిగిందని సజ్జనార్‌ తెలిపారు. దీన్ని కట్టడి చేయడంలో భాగంగా ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ibomma వెబ్ సైట్లో 50 లక్షల సబ్‌స్క్రైబర్ల డేటా ఉందని సీపీ సజ్జనార్ చెప్పారు. పైరసీతో సినీ రంగానికి చాలా నష్టం జరిగిందని, దీన్ని కట్టడి చేయడానికి ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వందకుపైగా పైరసీ వెబ్‌సైట్లతో తన సామాజ్రాన్ని రవి ఏర్పాటు చేసుకున్నారని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు తెలిపారు. రవి గెట్టింగ్ అప్, ఈఆర్ ఇన్ఫోటెక్ కంపెనీలకు సీఈవోగా ఉన్నారని తెలిపారు. తన టీంతో కలిసి యూకే నుంచి సర్వర్లు హ్యాకింగ్ చేస్తున్నారన్నారు.

FotoJet - 2025-11-17T121941.129

వివిధ వీపీఎన్‌‌లతో పలు లొకేషన్లు మారుస్తూ.. వెబ్‌సైట్‌లో సినిమాలు అప్‌లోడ్ చేస్తున్నారు. పైరసీ సినిమాల అప్‌లోడ్ కోసం వందకు పైగా వెబ్‌సైట్‌‌లు కొనుగోలు చేశారు. పైరసీ బయటపడి ఒక వెబ్‌సైట్‌‌ తొలగించినా.. మరో వెబ్‌సైట్‌ను వాడుకుంటూ సినిమాలు అప్‌లోడ్ చేస్తున్నారన్నారు. రవి ఇంట్లో స్వాధీనం చేసుకున్న వందలాది హార్డ్ డిస్క్‌లలో రెండువేలకు పైగా సినిమాలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. పైరసీ నెట్‌వర్క్‌ను ప్రపంచ స్థాయిలో విస్తరించారు. కూకట్‌పల్లిలోని ఆయన ఇంట్లో స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్‌లు, ల్యాప్ టాప్‌లు, మొబైల్ ఫోన్స్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కి తరలించారు. ఇప్పటికే రవిపై 7 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

ఇమ్మడి రవిపై ఐటీ యాక్ట్‌, కాపీ రైట్‌ యాక్ట్‌ కింద మరో 4 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ‘‘పైరసీకి సంబంధించి అంతకు ముందు ప్రశాంత్‌, శివరాజ్‌ను కూడా అరెస్టు చేశాం. ఇమ్మడి రవి సమాజానికి చాలా నష్టం చేకూర్చాడు. పైరసీ ద్వారా నష్టం చేయడమే కాకుండా బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేస్తున్నాడు. దీంతో చాలా మంది చనిపోయారు. ఒక వెబ్‌సైట్‌ను బ్లాక్‌ చేస్తే కొత్త సైట్‌ను తయారు చేశాడు. ఇలా65 మిర్రర్‌ వెబ్‌సైట్లు నిర్వహించాడు. 21 వేల సినిమాలు అతడి హార్డ్‌ డిస్క్‌లో ఉన్నాయి. 1972లో విడుదలైన గాడ్‌ఫాదర్‌ నుంచి మొన్న వచ్చిన ఓజీ వరకు అందులో ఉన్నాయి. రూ.20 కోట్లు పైరసీ ద్వారా సంపాదించాడు. అందులో రూ.3 కోట్లు సీజ్‌ చేశాం. 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల డేటా రవి వద్ద ఉంది. ఇంత డేటా అతడి వద్ద ఉండటం ప్రమాదకరం’’ అని సజ్జనార్‌ తెలిపారు.  కాగా ఇమ్మడి రవిని అరెస్ట్‌ చేసి సినిమా పరిశ్రమకు మేలు చేకూర్చిన పోలీస్‌ సిబ్బందికి దర్శక, నిర్మాతలు, నటులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు