TG Assembly: తాగి అసెంబ్లీకి.. కోమటిరెడ్డి టార్గెట్ గా హరీశ్ వివాదాస్పద వ్యాఖ్యలు!

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసినట్లుగానే అసెంబ్లీ బయట కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయాలని డిమాండ్ చేశారు. కొందరు పొద్దున్నే డ్రింక్ చేసి.. సభకు వస్తున్నారన్నారు.

New Update
Komatireddy Harish rao

అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాలంటూ బీఆర్ఎస్ సభ్యుడు హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కొందరు సభ్యులు తాగి వస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో రోడ్ల అంశంపై చర్చ జరిగింది. ఈ చర్చలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ..బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుకు దబాయించడం తప్ప పని చేయడం తెలియదని ఫైర్ అయ్యారు. కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్టుకును కట్టి కమిషన్ తీసుకోవడం మాత్రమే ఆయనకు తెలుసన్నారు. హరీశ్ రావు రూ.10 వేల కోట్లు దోచుకున్నాడని తీవ్ర ఆరోపణలు చేశారు. ఏడేళ్లు అయినా ఉప్పల్‌లో ఫ్లై ఓవర్‌ ను బీఆర్ఎస్ సర్కార్ పూర్తి చేయలేదన్నారు. 

Also Read: ఫార్ములా ఈ రేసు లో ఏసీబీ విచారణ కోరుతూ సిఎస్ శాంతకుమారి ఏసీబీకి లేఖ

Also Read: సైబర్ నేరాలు అరికట్టేందుకు కీలక ప్రాజెక్టు ప్రారంభించిన పోలీసులు

కోమటిరెడ్డికి హరీశ్ కౌంటర్..

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. కోమటిరెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలను వెంటనే రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తాను కమీషన్‌ తీసుకున్నట్టు నిరూపించాలని సవాల్‌ విసిరారు. అసెంబ్లీ బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టాలన్నారు. కొందరు మద్యం తాగి సభకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఆయా సభ్యులు తాగొచ్చి ఏం మాట్లాడుతున్నారో వారికి తెలియడం లేదు అంటూ కోమటిరెడ్డి టార్గెట్ గా వ్యాఖ్యలు చేయడం సభలో దుమారం రేపింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. హరీష్ రావు వెంటనే సభకు క్షమాపణ చెప్పాలన్నారు. హరీశ్ రావుకు వాళ్ల మామ గుర్తుకు వచ్చి సభలో ఇలా మాట్లాడుతున్నాడంటూ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని అన్నారు. అయితే.. హరీశ్ రావు వ్యాఖ్యలను కోమటిరెడ్డి వీడియోతో కలిపి బీఆర్ఎస్ నేతలు వైరల్ చేస్తున్నారు. 

Alos Read: అంతర్జాతీయ క్రికెట్‌కు ఆర్ అశ్విన్ రిటైర్మెంట్

Also Read: ఫ్లాట్ మేట్ కోసం ఎక్స్‌లో పోస్ట్..3లక్షలకు పైగా వ్యూస్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు