Telangana: నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశం..!

సోమవారం తెలంగాణ అసెంబ్లీ మూడో సమావేశం జరగనుంది. ఈ సమావేశాల కోసం ప్రభుత్వం ఎజెండాను విడుదల చేసిన సంగతి తెలిసిందే.సంతాప దినాల సందర్భంగా అసెంబ్లీ వేదికగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించేందుకు శాసనసభ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తోంది.

New Update
CM Revanth Reddy

CM Revanth Reddy

Telangana: సోమవారం తెలంగాణ అసెంబ్లీ మూడో సమావేశం జరగనుంది. ఈ సమావేశాల కోసం ప్రభుత్వం ఎజెండాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ సెక్రటరీ వీ నరసింహా చార్యులు ప్రకటించిన అంశాల ప్రకారం, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ మృతి నేపథ్యంలో రాష్ట్రంలో ఏడు రోజుల పాటు సంతాప దినాలను పాటించాలని ప్రభుత్వం ప్రకటించారు.

Also Read: ఆరోజు 'పుష్ప' నిర్మాతలే థియేటర్ తీసుకున్నారు.. నోటీసులపై సంధ్య థియేటర్ రిప్లై

ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీచేశారు.  సంతాప దినాల సందర్భంగా అసెంబ్లీ వేదికగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించేందుకు శాసనసభ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తోంది. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ మృతి పై సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు.

Also Read: Daaku Maharaj: బాలయ్య ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ గిఫ్ట్.. 'డాకు మహారాజ్' నుంచి మాస్ సాంగ్

ఈ సందర్భంగా దేశానికి మన్మోహన్ సింగ్ ఆర్ధిక మంత్రిగా, ప్రధాన మంత్రిగా దేశానికి అందించిన సేవలను గుర్తుచేస్తూ, ఆయన చేసిన కృషిని సభలో ప్రస్తావించనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు శాసనసభ సభ్యులు కూడా మాజీ ప్రధానమంత్రిపై తమ సంతాపాన్ని ప్రకటిస్తారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తారు.

Also Read: Mann ki Baat: మన్‌కీ బాత్‌లో ఏఎన్నార్ ప్రస్తావన.. ఎన్టీఆర్‌ను మర్చిపోయిన మోదీ

Also Read: DGP Jitendar: తెలంగాణలో పోలీసుల వరుస ఆత్మహత్యలు.. డీజీపీ సంచలన వ్యాఖ్యలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు