Naveen Yadav: టార్గెట్ నవీన్ యాదవ్.. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ అస్త్రం ఇదేనా?

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గోపినాథ్‌ మృతితో ఆ స్థానాన్ని తిరిగి దక్కించుకోవడానికి బీఆర్‌ఎస్‌ ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో నవీన్ యాదవ్ తండ్రి మీద ఉన్న రౌడీషీటును ప్రచారాస్త్రంగా ఉపయోగించనుంది.

New Update
Target Naveen Yadav

Target Naveen Yadav

Jubilee Hills By Election : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ మృతితో వచ్చిన ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఆయన సతీమణి మాగంటి సునీత(maganti Sunitha)కు బీఆర్‌ఎస్‌ టికెట్‌ కెటాయించింది. అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా నవీన్‌ యాదవ్‌(naveen yadav), బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థుల మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుందని భావిస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ రాష్ర్ట వ్యాప్తంగా విజయం సాధించి అధికారం చేపట్టినప్పటికీ హైదరాబాద్‌ లో మాత్రం ఒక సీటు గెలవలేకపోయింది. అదే సమయంలో రాష్ర్టంలో ఓటమి పాలయినప్పటికీ హైదరాబాద్‌ లో మాత్రం బీఆర్‌ఎస్ అన్ని స్థానాలను గెలుచుకుంది. 

Also Read :  ఇక KCR ఫొటో పెట్టుకోను.. కవిత సంచలన ప్రకటన!

రౌడీ షీటే ప్రధాన అస్త్రం

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గోపినాథ్‌ మృతితో ఆ స్థానాన్ని తిరిగి దక్కించుకోవడానికి బీఆర్‌ఎస్‌ పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా అన్ని పార్టీల కంటే ముందే తన ప్రచారాన్ని ప్రారంభించింది. నియోజకవర్గంలో అధికారంలో ఉన్నపుడు పార్టీ చేసిన అభివృద్ధితో పాటు దివంగత ఎమ్మెల్యే గోపినాథ్‌ చేసిన అభివృద్ధి, ఆయనకు ప్రజల్లో ఉన్న అభిమానాన్ని పార్టీ అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. దానితో పాటు ఆయన మరణంతో కొంత సానుభూతి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో ప్రత్యర్థి అభ్యర్థి నవీన్‌యాదవ్‌ పై ఉన్న ఆరోపణలను ప్రచారాస్త్రంగా మలుచుకోవడానికి బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా నవీన్‌యాదవ్‌ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్‌  పై  నేటికి జూబ్లీహిల్స్‌ పోలస్‌స్టేషన్‌లో ఉన్న రౌడీషీటును ప్రధాన అస్త్రంగా ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తోంది.1998 లోనే శ్రీశైలం యాదవ్ పై రౌడీ అనే ముద్ర ఉంది. ఆ రౌడీషీటర్ కొడుకే జూబిలీహిల్స్ ఉపఎన్నికలో పోటీ చేస్తున్న నవీన్ యాదవ్. అని ఇలాంటి రౌడీలని రాజకీయాల్లో గెలిపిస్తే ప్రజల ఆస్తులకి ప్రాణాలకే ప్రమాదం అంటూ ఆ పార్టీ ప్రచారం చేయనుంది. శ్రీశైలం యాదవ్‌ పై 9 హత్య కేసులు నేటికి కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయనే ప్రచారం ఉంది. అలాగే నవీన్‌యాదవ్‌ సోదరుడి భార్య కూడా ఆయనపై ఆరోపణలు చేస్తూ వస్తోంది. తన భర్తతో పాటు కుటుంబీకులు తనను వేధిస్తున్నారంటూ నవీన్ సోదరుడు వెంకట్ భార్య మహితాశ్రీ మీనాక్షీ నటరాజన్‌కు రాసిన లేఖ సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. రౌడీషీటర్ బ్యాక్‌డ్రాప్ ఉన్న నవీన్‌ లాంటివారికి రాజకీయాల్లో స్థానం కల్పించడంతో ప్రజలకు ముప్పు వాటిల్లుతుందని ఆమె ఆరోపిస్తున్నారు.ఇక జూబ్లీహిల్స్‌లో వేలాది దొంగ ఓట్లు చేర్చారని నవీన్‌ యాదవ్‌పై ఆరోపణలు వస్తున్నాయి. అందులో భాగంగా ఆయన  ఓటర్ కార్డులు పంచారని  ఇప్పటికే  నవీన్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. ఇక్కడ గెలవడం ద్వారా రాష్ర్టంలో బీఆర్‌ఎస్‌ కు ఆధరణ తగ్గలేదనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.


బీసీ కార్డుతో..

ఇక జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్‌ అనేక వడపోతల అనంతరం నవీన్‌ యాదవ్‌ను ఎంపిక చేసింది. స్థానిక నేత కావడంతో పాటు యువకుడు, సామాజిక సేవరంగాల్లో రాణిస్తుండటం కూడా ఆయనకు కలిసి వచ్చాయి. దీనికి తోడు కాంగ్రెస్‌ పార్టీ 42 శాతం బీసీలకు రిజర్వేషన్‌ అంశాన్ని ఇటీవల ఎత్తుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇక్కడ బీసీకి టికెట్‌ ఇవ్వడం ద్వారా తను ప్రతిపాదించిన బీసీ బిల్లుకు కట్టుబడి ఉన్నామనే సంకేతాన్ని ఇచ్చే ప్రయత్నం చేసింది. బీఆర్‌ఎస్‌, బీజేపీలు కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలకు టికెట్లివ్వగా కాంగ్రెస్‌ మాత్రం యాదవ సామాజిక వర్గానికి చెందిన నవీన్‌కు టికెట్ ఇచ్చి తమ బీసీ సాధికారతను నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇక గత ఎన్నికల్లో హైదరాబాద్‌లో ఒక సీటు కూడా గెలవని కాంగ్రెస్‌ ఇక్కడ గెలవడం ద్వారా నగరంలోనూ తమకు బలం ఉందని నిరూపించుకోవడంతో పాటు రాష్ర్ట ప్రజలు తమ ప్రభుత్వానికి మద్దతునిస్తున్నారనే సంకేతాలు ఇవ్వడానికి శాయశక్తుల ప్రయత్నిస్తోంది. ఇక్కడ నవీన్‌ యాదవ్‌ విజయం సాధిస్తే తమ బీసీ నినాదాన్ని ప్రజలు నమ్మారని కాంగ్రెస్‌ ప్రచారం చేసుకోవడంతో పాటు బీఆర్‌ఎస్‌ను తిరస్కరించారనే నిరూపించుకునే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. రెండు పార్టీల ఎత్తుగడల్లో ఎవరు విజయం సాధిస్తారో మరో నెల వరకు వేచిచూడాల్సిందే.

ఇది కూడా చూడండి: Pakisthan Vs Afghanistan: 15 నిమిషాల్లోనే తోక ముడిచిన పాక్.. సైనికులు పరుగో పరుగు-VIDEO VIRAL

Advertisment
తాజా కథనాలు