/rtv/media/media_files/2025/10/15/kavitha-kcr-2025-10-15-15-07-07.jpg)
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేయాలని కవిత నిర్ణయించారు. ఈ మేరకు జాగృతి జనంబాట పోస్టర్ ను ఆమె ఆవిష్కరించారు. అక్టోబర్ 25 నుంచి ఫిబ్రవరి 13 వరకు నాలుగు నెలల పాటు 33 జిల్లాల్లో యాత్ర నిర్వహించనున్నారు. అయితే ఈ యాత్రలో కేసీఆర్ ఫోటోను పెట్టుకోవటం లేదని కవిత స్పష్టం చేశారు. జాగృతి కార్యక్రమాల్లో కేసీఆర్ ఫోటోను పెట్టుకున్నాం కానీ ఇప్పుడు తాను ఆ పార్టీలో లేను కాబట్టి... అందుకే తన తరఫున క్లారిటీ ఇస్తున్నానని తెలిపారు. - చెట్టు పేరు చెప్పుకొని బతికే ఉద్దేశం తనకు లేదన్నారు కవిత. - ఆ చెట్టు నీడ లో ఉన్నంత వరకు దుర్మార్గుల బారి నుంచి చెట్టును కాపాడేందుకు ఎంతో ప్రయత్నం చేశానని చెప్పుకొచ్చారు. తాను నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసే వరకు జాగృతిలో కేసీఆర్ గారి ఫోటో పెట్టలేదన్నారు కవిత.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత 'జాగృతి జనం బాట' యాత్ర పోస్టర్‌ను హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ యాత్రను సామాజిక చైతన్యం కోసమే చేపడుతున్నట్లు తెలిపారు. ఆవిష్కరించిన పోస్టర్‌పై తెలంగాణ తల్లి మరియు ప్రొఫెసర్ జయశంకర్ చిత్రాలు మాత్రమే ఉండటంపై ఆమె వివరణ ఇచ్చారు.#kavitha… pic.twitter.com/w0OowdvKwl
— ABP Desam (@ABPDesam) October 15, 2025
నిజామాబాద్ నుంచి జాగృతి జనం బాట ప్రారంభం
తన దారిలో తాను వెళ్తుండగా కేసీఆర్ ఫోటో పెట్టుకోవటం నైతికంగా సరికాదన్నారు కవిత. అక్టోబర్ 25 నుంచి నిజామాబాద్ నుంచి జాగృతి జనం బాట ప్రారంభం కానుందని వెల్లడించారు. తాను జనం ఏం చెబుతారో వినాలనే జనం బాట కార్యక్రమం చేపడుతున్నానని కవిత చెప్పుకొచ్చారు. ప్రజల దగ్గరకు వెళ్లి వాళ్లు చెప్పే మాటలు వినాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. - తెలంగాణ వస్తే ఏం కావాలని ప్రజలు కోరుకున్నారో... ఏం జరిగిందో, ఏం జరగాలని కోరుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నా అని కవిత తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో కవిత యాత్రను చేయనున్నారని, బీసీ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ఈ యాత్రకు ప్లాన్ చేసినట్లుగా టాక్ నడుస్తోంది. ఇక -జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తమకు చిన్న విషయం అన్న కవిత.. తెలంగాణ అనేదే పెద్ద అంశమని కవిత చెప్పుకొచ్చారు. పార్టీ తనను సస్పెండ్ చేశాక ఎమ్మెల్సీ పదవి పైన తనకు వ్యామోహం పోయిందన్నారు.
సామజిక తెలంగాణ అన్నందుకు నామీద కుట్రలు చేసి నన్ను బీఆర్ఎస్ నుంచి బయటికి గెంటేశారు. ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు రావాలి అనడం తప్పా?మనం భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం కానీ సామాజిక తెలంగాణ సాధించుకోలేదు
— Telugu Stride (@TeluguStride) October 15, 2025
- కల్వకుంట్ల కవిత#kalvakuntlakavitha#Telanganajagrutipic.twitter.com/6MCwkMlZ6X
కాగా అంతర్గత విమర్శలు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్(BRS Party) అధినేత కేసీఆర్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ జరిగిన మరుసటి రోజు ఆమె బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆమె చేపట్టనున్న యాత్ర రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.