/rtv/media/media_files/2025/07/01/susmita-patel-konda-2025-07-01-13-04-40.jpg)
SUSMITA PATEL KONDA
Konda Susmita Patel:
ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ. ఆమె భర్త కొండా మురళిల వ్యవహారంతో తలలు పట్టుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి వారి కూతురు సుస్మిత పటేల్ మరో షాక్ ఇచ్చారు. తాజాగా తన సోషల్ మీడియా హ్యాండిళ్లలో కొండా సుస్మిత కీలక అప్ డేట్ చేశారు. `పరకాల నుంచి పోటీకి సిద్ధమవుతున్న కొండా సుస్మిత` అంటూ.. పేర్కొన్నారు. దీంతో వరంగల్ రాజకీయాల్లో పెను సంచలనం రేగింది. అంతేకాదు పరకాలోని పలు జంక్షన్‌లలో సుస్మిత పేరుతో ఫ్లెక్సీలు వెలవడం సంచలనంగా మారింది.
Also Read: Phone-tapping : పక్క రాష్ట్రాల్లోని ఫోన్లూ ట్యాప్ చేయచ్చు..కానీ ఎట్లనో తెలుసా?
కాగా తమ రాజకీయ వారసురాలిగా సుస్మితను రంగంలోకి దింపాలని గత కొంత కాలంగా కొండా దంపతులు ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల సమయంలోనూ ఆమె పేరు వినిపించింది. పరకాల నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రచారం సాగింది. అయితే చివరినిమిషంలో ఆ సీటును రేవూరి ప్రకాశ్ రెడ్డికి కేటాయించడంతో ఆమె వెనక్కు దగ్గింది. అయితే రానున్న ఎన్నకల్లో మాత్రం తాను పోటీలో ఉండాలనే భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జిల్లాకు చెందిన కడియం శ్రీహరి తన కూతురుకు ఎంపీ టికెట్ ఇప్పించుకుని గెలిపించుకోవడంతో కొండా దంపుతులు కూడా తమ కూతురును రాజకీయ రంగంలోకి దింపాలని భావిస్తున్నారు. దీంతో కొండా సుస్మితపొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు తహతహ లాడుతున్నారు.
Also Read:Kannappa Piracy: మంచు విష్ణు 'కన్నప్ప' కు పైరసీ దెబ్బ.. వేల సంఖ్యల్లో ఆన్ లైన్ లింకులు
ఇదిలా ఉండగా కొంతకాలంగా జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మె్ల్యేలకు, కొండా ఫ్యామిలీకి అసలు పడటం లేదు. స్థానిక ఎమ్మెల్యేల మీద కొండా మురళి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వారు అధిష్టానికి ఫిర్యాదు చేశారు. అయితే మురళి ఏమాత్రం తగ్గకుండా క్రమశిక్షణ కమిటీకి బలనిరూపన నిరూపించుకునే ప్రయత్నం చేశారు. తన మంది మార్భాలంతో వారి ముందుకు రావడం చర్చనీయంశంగా మారింది. మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి తదితరుల మీద ఆయన రివర్స్ ఫిర్యాదు చేశారు. దీంతో ఆ జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ తరుణంలో సుస్మిత ఎంట్రీ ఇవ్వడం మరోసారి సంచలనంగా మారింది.
Also Read: వైద్య రంగంలో సంచలనం.. శాటిలైట్ సాయంతో 5,000 కిలోమీటర్ల దూరం నుంచి సర్జరీ