Supreme Court : కోర్టు ధిక్కరణ..స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సుప్రీం కోర్టు నోటీసులు

బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీం కోర్టు  తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు నోటీసులు జారీ చేసింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

New Update
FotoJet - 2026-01-19T133459.483

Supreme Court notices to Speaker Gaddam Prasad

Supreme Court : బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు(BRS defecting MLAs) కీలక దశకు చేరుకుంది. కాగా ఈ రోజు సుప్రీం కోర్టు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌(speaker gaddam prasad on disqualification of mlas )కు నోటీసులు జారీ చేసింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి(BJP MLA Maheshwar Reddy) పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అదే కేసులో కేటీఆర్ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్‌తో మహేశ్వర్ రెడ్డి పిటిషన్‌ను జత చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం స్పీకర్‌ కు నోటీసులు జారీ చేసింది. అయితే బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ ఇచ్చిన క్లీన్ చిట్‌ను బీజేపీ సుప్రీం కోర్టు(contempt of court)లో సవాలు చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. 

కాగా ఇటీవల తెలంగాణ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ను ఉద్దేశించి సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఫిరాయింపుల వ్యవహారాన్ని తేల్చేందుకు తగిన సమయం ఇచ్చినా నిర్ణయం తీసుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే చివరి అవకాశమని.. ఇకనైనా నిర్ణయం తీసుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఫిరాయింపుల ఆరోపణలతో బీఆర్‌ఎస్‌ వేసిన పిటిషన్లను జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్‌ల ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. ఈ సందర్భంగా.. ఇప్పటికే ఏడుగురి విషయంలో స్పీకర్‌ ఓ నిర్ణయం తీసుకున్నారని స్పీకర్‌ తరఫున అభిషేక్‌ సంఘ్వీ వాదనలు వినిపించారు. మరో ముగ్గురిని విచారణ జరపాల్పి ఉందని నివేదించారు. 

Also Read :  ఒక వ్యక్తి ఎన్ని బీర్లు తాగొచ్చు.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే?

Supreme Court Notices To Speaker Gaddam Prasad

‘‘ఏడుగురు ఎమ్మెల్యేల పిటిషన్లపై విచారణ జరిపి నిర్ణయం తీసుకున్నాం. స్పీకర్‌కు కంటి సర్జరీ జరిగింది. అసెంబ్లీ సెక్రటరీ జనరల్ మారారు. అందువల్ల విచారణ కొంత ఆలస్యమైంది. నాలుగు వారాల సమయం ఇవ్వండి విచారణ పూర్తి చేస్తాం’’ అని కోర్టుకు తెలిపారు. అయితే  బీఆర్ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తూ.. ‘‘పదిమంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఒక ఎమ్మెల్యే ఏకంగా అధికార పార్టీ నుంచి పోటీ చేశారు. కానీ తాను పార్టీ మారలేదని అంటున్నారు. ఈ వాదనలో న్యాయమేమైనా ఉందా?.  అని ఆయన ప్రశ్నించారు. స్పీకర్ వారిని ఇప్పటికీ విచారించడం లేదు. మూడు నెలలకు పైగా  గడిచిపోయాయి. ప్రతిసారి విచారణకు గడువు పెంచమని  అడుగుతున్నారు’’ అని వాదించారు. ఈ తరుణంలో బీఆర్‌ఎస్‌ తరఫు లాయర్‌ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. ఈ విషయంలో స్పీకర్‌ విధానాన్ని తప్పు బట్టింది.

‘‘ఇప్పటికే తగిన సమయం ఇచ్చాం.. ఈ పాటికే నిర్ణయం తీసుకోవాల్సి ఉండేది. ఇదే చివరి అవకాశం. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోండి.  లేకుంటే పరిణామాలు ఉంటాయి’’ అని స్పీకర్‌కు సుప్రీంకోర్టు తీవ్రంగా హెచ్చరికా జారీచేసింది. మిగిలిన ఎమ్మెల్యేల విచారణను నాలుగు వారాల గడువు కావాలని సింఘ్వీ కోరారు. అయితే రెండు వారాల్లోపురోగతి చూపిస్తే.. నాలుగు వారాల సమయం ఇస్తామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.  ఇదే క్రమంలో దాదాపు ఏడుగురు ఎమ్మె్ల్యేలకు స్పీకర్‌ క్లీన్‌ చీట్‌ ఇవ్వడాన్ని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తప్పు బట్టారు. సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు.
 
మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ స్పీకర్‌కు వివరణ ఇచ్చారు. అయితే ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలైతే ఇంకా స్పీకర్‌ ఎదుట హాజరై కనీస వివరణ కూడా ఇచ్చుకోలేదు. తమకు గడువు ఇవ్వాలన్న విజ్ఞప్తులపైనా స్పీకర్‌ ఇప్పటిదాకా ఎలాంటి బదులు ఇవ్వకపోవడం గమనార్హం. ఈ తరుణంలో.. ఇప్పుడు సుప్రీం కోర్టు అల్టిమేటంతో ఎమ్మెల్యేలను స్పీకర్‌ విచారించాల్సిన పరిస్థితి ఎదురైంది.

Also Read :  గులాబీ పార్టీలో గ్రూప్ వార్.. తలలు పట్టుకుంటున్న అధిష్టానం

Advertisment
తాజా కథనాలు