Telangana: అత్యవసరమైతేనే తెల్లవారుజామున ప్రయాణాలు పెట్టుకోండి!

తెలంగాణ వ్యాప్తంగా తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్ముకుంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు ప్రకటించారు. ఐదు రోజులు రాష్ట్రంలో సాధారణ కనిష్ఠ ఉష్ణోగ్రతలే ఉంటాయన్నారు.అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయోద్దన్నారు.

New Update
delhi fog

delhi fog

Telangana: రాష్ట్ర వ్యాప్తంగా తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కప్పేస్తోందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రధానంగా తూర్పు తెలంగాణ జిల్లాల్లో పొగమంచు ఎక్కువగా కురుస్తుందని వాతావరణ శాఖ అధికారి రవీంద్రకుమార్‌ తెలిపారు. రాత్రి, తెల్లవారుజామున ఎక్కువగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Also Read: Flipkart Republic Day deals 2025: ఫ్లిప్‌కార్ట్ కొత్త సేల్.. వాటిపై 70 శాతం డిస్కౌంట్స్!

రాష్ట్రంలో ప్రస్తుతం కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంగానే కొనసాగుతున్నాయని, హైదరాబాద్​లో గత రెండు రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు 18 డిగ్రీలకు పడిపోయాయని రవీంద్రకుమార్ తెలిపారు. రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో సాధారణ కనిష్ఠ ఉష్ణోగ్రతలే కొనసాగుతాయని వివరించారు. తూర్పు జిల్లాలైనా భద్రాద్రి, ఖమ్మం, ములుగు జిల్లాలో పొగ మంచు ఎక్కవగా ఉండే అవకాశాలున్నాయని చెప్పారు.

Also Read: Best Camera Mobiles @ Rs 15k: బెస్ట్ 108MP కెమెరా ఫోన్లు.. కేవలం రూ.15 వేల లోపే!

రాష్ట్రవ్యాప్తంగా పొగ మంచు ఉంటుందని తూర్పు జిల్లాల్లో అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. ఆగ్నేయం నుంచి గాలులు వీస్తున్నందుకు, మరోవైపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఉన్నకారణంగా పొగ మంచు కురుస్తుందన్నారు.

వచ్చే వారం రోజుల్లో వర్షాలు :

రాబోయే నెల రోజుల పాటు రాష్ట్రంలో పొగ మంచు కురుస్తుందని రవీంద్రకుమార్ తెలిపారు. దట్టమైన పొగమంచు ఉంటున్న కారణంగా అత్యవసర ప్రయాణాలే చేయాలని సూచించారు. కాగా రాబోయే వారం నుంచి పది రోజుల మధ్య వర్షాలు కురిసే అవకాశముందన్నారు.

Also Read: Maha Kumbh 2025: గత 48 గంటల్లో 85 లక్షల మంది పుణ్యస్నానాలు.. చరిత్రలో అతి పెద్ద ఉత్సవంగా కుంభమేళ

Also Read: BIG BREAKING: పండగ వేళ తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. రేపే జాతీయ పసుపు బోర్డు ప్రారంభం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు