BIG BREAKING: పండగ వేళ తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. రేపే జాతీయ పసుపు బోర్డు ప్రారంభం

సంక్రాంతి పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం పసుపు రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం చేయనున్నట్లు ప్రకటించింది.

New Update
Pm Modi

Pm Modi

సంక్రాంతి పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం పసుపు రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం చేయనున్నట్లు ప్రకటించింది. ఈ బోర్డుకు ఛైర్మన్‌గా పల్లె గంగారెడ్డిని నియమించింది. మూడేళ్ల పాటు ఈయన ఆ పదవిలో కొనసాగుతారని పేర్కొంది. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ గతంలో హైదరాబాద్‌లో జరిగిన ఓ సభలో చెప్పిన సంగతి తెలిసిందే. 

పసుపు బోర్డు ప్రయోజనాలు

పసుపు బోర్డు వల్ల పసుపును పండించే రైతులకు చాలావరకు మేలు కలుగుతుంది. కొత్త వంగడాల అభివృద్ధి నుంచి హర్వెస్ట్‌ మేనేజ్‌మెంట్, మార్కెట్‌ వరకు రైతులకు లబ్ధి ఉంటుంది. ఈ పంటకు మద్దతు ధర ఎక్కువగా వస్తుంది. అలాగే పసుపు తవ్వడం, ఉడకబెట్టడం, ఆరబెట్టడం లాంటివి చేసేందుకు అవసరమైన యంత్రాలకు ప్రభుత్వం రాయితీ అందిస్తుంది. పంట నాణ్యత, దిగుబడి పెంచేలా రైతులకు సహాకారం ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే ప్రతీ సీజన్‌లో మొత్తం 9 లక్షల క్వింటాళ్ల పసుపు దిగుబడి వస్తుంది. 

Also Read: మహా కుంభమేళా.. యూపీకి రూ.2 లక్షల కోట్ల ఆదాయం !

గత కొన్నేళ్లుగా నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా 2019 లోక్‌సభ ఎన్నికల్లో తనని గెలిపిస్తే పసుపు బోర్డు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. కానీ అది నెరవేరలేదు. చివరికి 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ ఓ బహిరంగ సభలో బీజేపీ అధికారంలోకి వస్తే జాతీయ పసుపు బోర్డు తీసుకొస్తామని ప్రకటించారు. అయితే తాజాగా పసుపు బోర్డుకు సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. మంగళవారం నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం చేయనునన్నట్లు పేర్కొంది. దీంతో పసుపు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దీనిపై ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. మకర సంక్రాంతికి మోదీ మరచిపోలేని బహుమతి ఇచ్చారంటూ కొనియాడారు. అలాగే జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్‌గా నియామితులైన పల్లె గంగారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

 

Also read: జూకర్‌బర్గ్ చెప్పింది తప్పు.. అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు