GUDEM : గూడెం మహిపాల్‌ రెడ్డికి బిగ్‌షాక్.. ఇస్నాపూర్‌ మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్‌పై వేటు

సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌ మున్సిపాలిటీలో పటాన్‌ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి బిగ్‌ షాక్‌ తగిలింది.వైస్‌ చైర్‌పర్సన్‌ మాధవిరెడ్డి కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచి BRSలోచేరారు. కాంగ్రెస్ విప్ ధిక్కరించినందుకు గాను ఆమెపై కలెక్టర్ వేటు వేశారు.

New Update
FotoJet - 2026-02-09T180241.440

gudem mahipal reddy

Isnapur Municipal : సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ విషయంలో పటాన్‌ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డికి బిగ్‌ షాక్‌ తగిలింది. బీఆర్‌ఎస్‌ లో గెలిచి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న మహిపాల్‌ రెడ్డి మొన్నటి మున్సిపల్‌ ఎన్నికల సమయంలో తిరిగి బీఆర్‌ఎస్‌ వైపు మళ్లారు. దీంతో తన నియోజకవర్గంలో ఉన్న మున్సిపాలిటీలలో గులాబీ జెండానే ఎగిరేలా ప్రచారం చేశారు. అలాగే ఇస్నాపూర్‌ కూడా బీఆర్‌ఎస్‌ వశమైంది. అయితే అంతా ఒకే అనుకున్న సమయంలో తాజాగా కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నీలమధు ముదిరాజ్‌ గూడెం మహిపాల్ రెడ్డి, రఘునందన్‌ రావుకు బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చాడు.

 
ఇస్నాపూర్‌ మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్‌పై కలెక్టర్‌తో వేటు వేయించారు. వైస్‌ చైర్‌పర్సన్‌ మాధవి రెడ్డి కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచి BRSలోకి వెళ్లి ఇస్నాపూర్ వైస్‌ చైర్‌పర్సన్‌ అయ్యారు. అయితే ఎన్నిక సమయంలో కాంగ్రెస్ జారీ చేసిన విప్ ధిక్కరించినందుకు గాను ఆమెపై కలెక్టర్ వేటు వేశారు. కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్‌గా గెలిచిన మాధవిరెడ్డిని గూడెం మహిపాల్ రెడ్డి BRSలో జాయిన్ చేసుకున్నారు. దీంతో ఇప్పుడు గూడెంకు రివర్స్‌లో షాక్ ఇచ్చాడు నీలం మధు ముదిరాజ్. ఈ పరిణామంతో  ఇస్నాపూర్ మున్సిపాలిటీ  కాంగ్రెస్ కైవసం కానుంది. ఛైర్మన్‌గా నీలం మధు ముదిరాజ్ భార్య నీలం పద్మ అయ్యే అవకాశం ఉంది.

అసలేం జరిగిందంటే..

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అనేక ట్విస్ట్‌లు జరిగాయి. ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలోనూ బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అయితే ఇక్కడ 26 వార్డులకు గాను బీఆర్‌ఎస్ 12 స్థానాలు గెలుచుకుని ఆధిక్యం సాధించింది. కాంగ్రెస్ 10, స్వతంత్రులు 4 గెలుపొందారు. అయితే ముగ్గురు స్వతంత్రులు కాంగ్రెస్ వైపు వెళ్లగా ఒకరు బీఆర్ఎస్ లో చేరారు. దీంతో రెండు పార్టీల సంఖ్య 13కు చేరింది. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన 1వ వార్డు కౌన్సిలర్ మమత.. కాంగ్రెస్ పార్టీలో చేరారు.  8వ వార్డు కౌన్సిలర్‌గా గెలిచిన మాధవి నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ గూటికి చేరారు. దీంతో ఇరు పార్టీల బలం సమానం కాగా  బీజేపీ ఎంపీ రఘునందన్ రావు , బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇద్దరూ ఎక్స్ అఫిషియో సభ్యులుగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో బీఆర్‌ఎస్‌ వశమైంది. అయితే ఇపుడు వైస్‌ చైర్మన్ పై వేటు పడటం చర్చనీయంశంగా మారింది.

Advertisment
తాజా కథనాలు