Metro Construction In Old City : ఆ కట్టడాల వద్ద పనులు ఆపండి.. పాతబస్తీ మెట్రో నిర్మాణంపై హైకోర్టు కీలక ఆర్డర్

పాతబస్తీలో మెట్రో నిర్మాణ పనులపై తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. మెట్రో నిర్మాణం వల్ల పాతబస్తీలోని పలు చారిత్రక కట్టడాలు దెబ్బ తింటున్నాయని యాక్ట్‌ ఫర్‌ పబ్లిక్‌ వెల్ఫేర్‌ ఫౌండేషన్‌ అనే సంస్థ తన పిటిషన్‌లో పేర్కొంది.

New Update
Old City Metro Rail

Old City Metro Rail

 Metro Construction In Old City :  పాతబస్తీలో మెట్రో విస్తరణకు అడుగడుగున అంతరాయం ఏర్పాడుతోంది. గతంలో మెట్రో విస్తరణకు అక్కడి ప్రజలు అంగీకరించకపోవడంతో చాలాకాలం వరకు పెండింగ్ పడింది.అయితే ఇప్పుడిప్పుడే సానుకూలత ఏర్పడుతున్న సమయంలో కోర్టు కేసుల రూపంలో మరోసారి మెట్రో విస్తరణపై ప్రభావం పడనుంది. పాతబస్తీలో మెట్రో నిర్మాణ పనులపై తెలంగాణ హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. యాక్ట్‌ ఫర్‌ పబ్లిక్‌ వెల్ఫేర్‌ అనే ఫౌండేషన్‌ హైకోర్టులో ఈ పిటిషన్ ను దాఖలు చేసింది. దానిలో భాగంగా మెట్రో నిర్మాణం వల్ల పాతబస్తీలోని పలు చారిత్రక కట్టడాలు దెబ్బ తింటున్నాయని పిటిషన్‌లో పేర్కొంది. వేలాది సంవత్సరాల చరిత్ర కలిగిన కట్టడాలకు మెట్రోవల్ల నష్టం వాటిల్లుతోందని ఆ సంస్థ పేర్కొంది.

Also Read: వేసవిలో తరచుగా కడుపునొప్పి వస్తుందా?. ఇది తెలుసుకోండి

 అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏఏజీ వాదనలు వినిపిస్తూ పురావస్తు శాఖ గుర్తించిన చారిత్రక కట్టడాలకు ఎలాంటి నష్టం లేకుండా చూస్తున్నామని, చారిత్రక కట్టడాలను కూలగొట్టడం లేదని కోర్టుకు తెలిపారు. పరిహారం చెల్లించాకే స్థలాలు సేకరించి నిర్మాణాలు చేపడతామని పేర్కొన్నారు. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయడానికి ఏఏజీ న్యాయస్థానాన్ని కొంత సమయం కావాలని కోరారు. చారిత్రక కట్టడాల విషయంలో ప్రభుత్వం నష్టం చేయకుండానే పనులు చేపడుతుందని స్పష్టం చేశారు.

Also Read: TS: జపాన్ కంపెనీలతో కీలకమైన ఒప్పందాలు..సీఎం రేవంత్ రెడ్డి


ఇక దీనిపై ధర్మాసనం స్పందిస్తూ పాతబస్తీలోని మెట్రో నిర్మాణ పనుల్లో భాగంగా చారిత్రక కట్టడాలకు ఎలాంటి నష్టం చేయకూడదని ప్రభుత్వానికి సూచించింది. పురావస్తు శాఖ గుర్తించిన చారిత్రక కట్టడాల వద్ద ఎలాంటి పనులు చేపట్టకూడదని న్యాయస్థానం ఆదేశించింది. ఈ నెల 22లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు, పిటిషన్‌పై తదుపరి విచారణను ఏప్రిల్ 22కి వాయిదా వేసింది.

Also Read: రాజీవ్ యువ వికాసంతో యువకుల జీవితాలు మారుతాయి: భట్టి

Also Read :  బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఆ నలుగురు ఔట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు